యంగ్ హీరో సందీప్ 'A1 ఎక్స్‌ప్రెస్' ఫస్ట్‌లుక్ రిలీజ్

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 05:39 PM

యంగ్ హీరో సందీప్ 'A1 ఎక్స్‌ప్రెస్' ఫస్ట్‌లుక్ రిలీజ్

యంగ్ హీరో సందీప్ కిషన్ తాజా సినిమా 'A1 ఎక్స్‌ప్రెస్'. ఈ సినిమా కోసం ఆశ్చర్యపర్చేలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు సందీప్ కిషన్. సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారి కండలు పెంచేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ఈ పోస్టర్‌లో షర్ట్ లేకుండా కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు సందీప్ కిషన్. చేతిలో ఇండియన్ జెర్సీతో పాటు హాకీ స్టిక్ ఉన్నాయి. తెలుగులో హాకీ నేపథ్యంలో రానున్న తొలి సినిమా ఇదే అంటూ ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ షేర్ చేశాడు సందీప్ కిషన్. సందీప్ కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో ఆయన సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో హాకీ ప్లేయర్‌గా సందీప్ కనిపించబోతున్నాడు.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయా పన్నెం నిర్మిస్తుండగా.. డెన్నిస్‌ జీవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సో.. చూడాలి మరి ఈ ప్రయోగాత్మక సినిమా సందీప్ కేరీర్‌ని ఎలా మలుపుతిప్పుతుందనేది!.







Untitled Document
Advertisements