మనదేశంలో త్వరలో రియల్ మీ వీ15 లాంచ్

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 07:08 PM

మనదేశంలో త్వరలో రియల్ మీ వీ15 లాంచ్

రియల్ మీ వీ15 5జీ మనదేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ పొందింది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ తెలిపారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పుకార్లు ఎప్పటి నుంచో వచ్చాయి. ఎట్టకేలకు ఈ వారంలోనే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లేను అందించారు. అయితే దీని గురించి కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


RMX3092 అనే మోడల్ నంబర్‌తో రియల్ మీ వీ15 5జీ బీఐఎస్ సర్టిఫికేషన్ పొందినట్లు తెలుస్తోంది. బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా పొందింది కాబట్టి ఈ ఫోన్ త్వరలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ముకుల్ శర్మ పేర్కొన్నారు. ఈ ఫోన్ చైనా వేరియంట్లో కొయ్ అనే ప్రత్యేకమైన కలర్ ఆప్షన్‌ను కూడా అందించారు. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,399 యువాన్లుగా(సుమారు రూ.15,900) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా(సుమారు రూ.22,700) ఉంది. మనదేశంలో కూడా వీటి ధర ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
చైనాలో లాంచ్ అయిన రియల్ మీ వీ15 5జీలో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండనుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 90.8 శాతంగా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం లేదు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.


ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను కూడా ఇందులో అందించారు. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4310 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.81 సెంటమీటర్లుగానూ, బరువు 176 గ్రాములుగానూ ఉంది.





Untitled Document
Advertisements