"వాళ్లు మీ ఇంటికి కూడా వస్తారు...మీ అమ్మ, అక్కల్ని జాగ్రత్తగా చూసుకోండి"

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 07:14 PM


టాలీవుడ్ నటి, బీజేపీ లీడర్ మాధవీలత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. బీజేపీ తీర్థం పుచ్చుకున్న తరువాత తరచూ లైవ్‌లు, పోస్ట్‌లు పెట్టి తన వాదన వినిస్తూ ఉంటుంది. అయితే మాధవీలత లైవ్‌లోకి వచ్చినా.. ఏదైనా పోస్ట్ పెట్టినా కామెంట్ల మోత మోగుతూ ఉంటుంది. అందులో చాలావరకూ ఆమెకు నెగిటివ్‌గానే వస్తాయి.. పచ్చి బూతులు తిడుతంటున్నారు. అయితే మాధవీలత తక్కువేం కాదు.. వాళ్లు ఒక్కటి తిడితే నేను వంద తిడతా అన్నట్టుగా వాళ్లు లకారాలతో బూతులు తిడితే.. అమ్మ అక్క చెల్లి అంటూ మాధవీలత కూడా లకారాలు అందుకుని తనని తిట్టే వాళ్లని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మాధవీలత ఢీ అంటే ఢీ అన్నట్టుగానే ఉంటుంది.
హాఫ్ నాలెడ్జ్‌తో నోటికొచ్చినట్టు మాట్లాడుతుందని.. ఎక్కడో ఎవడో షేర్ చేసిన పోస్ట్‌లను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసి బిల్డప్‌లు ఇస్తుందే తప్ప అసలు ఈమెకు ఇతర పార్టీలను కానీ, నాయకుల్ని కానీ విమర్శించే నాలెడ్జ్ కానీ అవగాహన గానీ లేదని మాధవీలతపై దారుణమైన కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు.
తాజాగా ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చిన మాధవీలత.. నెగిటివ్ కామెంట్లకు రియాక్ట్ అవ్వను అంటూ బూతులతో విరుచుకుపడింది. ‘కొత్త ఏడాదిలో చెత్త కామెంట్లకు రియాక్ట్ కాకూడదని అనుకున్నా.. నా వాల్‌లో మీ కామెంట్లకు రిప్లై వస్తే.. అది నేను పెట్టట్లేదు. నా పేజ్‌ని మ్యానేజ్ చేసేవాళ్లు పెడతారు. మీలాంటి శాడిస్ట్‌లనే నా పేజ్ చూడటానికి పెట్టుకున్నా.. వాళ్లలో కూడా సైకోయిజం. మీ సైకోయిజం తట్టుకోవాలంటే సైకోలే ఉండాలి.
మాధవీలత.. మన మెసేజ్‌లకు రిప్లై ఇస్తుంది.. అబ్బా అని.. గింజ, బొంజ అని తిడదాం అనుకుంటే మాత్రం మా వాళ్లు కూడా అదే రేంజ్‌లో తిడతారు. వాళ్లు మీ ఇంటికి కూడా వచ్చేస్తారు.. మీ అమ్మ, అక్కల్ని జాగ్రత్తగా చూసుకోండి. బెదిరిస్తున్నారని అనుకోండి.. మీరు నన్ను అంటే వాళ్లు మిమ్మల్ని అంటారు. ఎందుకంటే భూమి మీద ఎవరూ మంచోళ్లు లేరు. మీరు మంచివాళ్లు కాకపోతే.. నేను మంచిదాన్ని కాదు అని వార్నింగ్ ఇచ్చారు మాధవీలత.
ఇక తన బీజేపీ పార్టీ వాదన వినిపిస్తూ.. మతం మారితే జబ్బులు తగ్గవు.. మీకు డబ్బులు వస్తాయి అంతే. మాయ రోగాలు వస్తాయి. భారతదేశంలో ఉన్న కల్చర్‌ని ఎదుటి వాళ్ల బొట్టులు, చీరలు, వాళ్ల చీరల మీదనో కామెంట్ చేయడం కాదు.. మీరేదో పత్తిత్తులు ఉత్తములు అన్నట్టుగా కామెంట్లు చేయడం కాదు. మీరేం శ్రీరామచంద్రులేం కాదు.. చీరలు కడితే నడుములు చూసే రకాలు మీరు. మీరు చీరలుకట్టడం గురించి మాట్లాడతారా?? చీరలు కట్టినా పైకి లాగి పిన్నులు పెట్టుకోవాల్సి వస్తుంది. వెనక కూడా పైకి లాగి పిన్నులు పెట్టుకోవాలి.. ఇదంతా అవసరమా? మాకు?? టీ షర్ట్ వేసుకుంటే ఏ గొడవా ఉండదు.
మీ కక్కుర్తికి చీరలు కట్టుకోమంటారు.. ఎందుకంటే తొంగి తొంగి నడుములు చూడొచ్చని. ఆ పక్క నుంచి అది చూడొచ్చు.. వెనక నుంచి ఇంకోటి చూడొచ్చని. ఇదేగా మీ యాపారం.. మేమేదో చీరకడితే సీతాదేవిలా భావించి నమస్కారం చేసినట్టు. ఎందుకు మీ కక్కుర్తి మాకు తెలియదా.. నడుము చూడటానికి మీ వెధవ నాటకాలు అని మాకు తెలియదా.
కాబట్టి చీరకట్టుకున్నవాళ్లంతా సీతా దేవిలు కాదు.. మోడ్రన్ డ్రస్ వేసుకున్నవాళ్లు చెడిపోయిన వాళ్లు కాదు. మీ ఆలోచనలు చెడిపోతే దానికి ఎవడూ ఏం చేయలేడు’ అంటూ తనపై నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లపై మండిపడింది మాధవీలత.







Untitled Document
Advertisements