ప్రెగ్నెన్సీ కోసం భారత యువకుల కోసం క్యూ కడుతున్న యూరప్ మహిళలు!

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 07:17 PM

ప్రెగ్నెన్సీ కోసం భారత యువకుల కోసం క్యూ కడుతున్న యూరప్ మహిళలు!

యూరప్ దేశాల నుంచి మహిళలు లడఖ్‌‌కు క్యూ కడుతున్నారు. ఏటికేడు వీరి సంఖ్య పెరుగుతోంది. కశ్మీర్ అందాలను వీక్షించడానికే వీరంతా ఇక్కడికి వస్తున్నారనుకుంటే పొరపాటే. ఇక్కడి అందమైన మగాళ్ల కోసం వాళ్లు ఇంత దూరం వస్తున్నారట. వారితో కలయికలో పాల్గొనడానికి ఉవ్విళ్లూరుతున్నారట. ప్రత్యేకంగా నాలుగు గ్రామాలకే వస్తున్నారు. ఇక్కడి యువకులతో అందమైన పిల్లలను కనాలని యూరప్ అమ్మాయిలు ఇంత దూరం వస్తున్నారు. 2015 నుంచి కొనసాగుతున్న ఈ తంతు ఏటేటా పెరుగుతోంది.
పాశ్చాత్య దేశాలకు చెందిన అమ్మాయిలు కాస్త ఫాస్ట్‌గానే ఉంటారు. ఆజానుభావులైన అబ్బాయిలను వెతుక్కొని మరీ వారితో కలయికను ఎంజాయ్ చేస్తారు. ఇందుకోసం ఏమాత్రం వెనుకాడరు. చాలా మంది తెల్ల పిల్లలు వెస్టిండీస్ తదితర దేశాలకు చెందిన మగాళ్లతో పడక సుఖాన్ని ఎంజాయ్ చేసిన ఉదంతాల గురించి మనం గతంలో చాలానే విన్నాం. కానీ, యూరప్ అమ్మాయిలు లడఖ్ రావడమేంటి? అందులోనూ గ్రామస్థులతో పడక సుఖం కోరుకోవడమేంటి? ఆ ఆసక్తికర వివరాలు..

ఆర్యన్ తెగకు చెందిన వారితో కలయికలో పాల్గొని సంతానం పొందాలని యూరప్ దేశాల మహిళలు భావిస్తున్నారట. ప్రధానంగా జ‌ర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ లాంటి దేశాల నుంచి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు. ఆయా గ్రామాల్లో వారం నుంచి 10 రోజుల వరకు బస చేస్తున్నారు. తమ పని ముగించుకొని వెళ్లిపోతున్నారు.

అది సింధు నది తీరం వెంట ఉన్న సుందరమైన ప్రాంతం. అక్కడి పర్యత లోయలు, ప్రకృతి అందాలు మైమరపింపజేస్తాయి. ఆ తీరం వెంట ఓ నాలుగు గ్రామాలు ఉంటాయి. అవి: దాహ్, హను, దార్చిక్, గార్కన్ (Dah, Hanu, Darchik and Garkon). ఈ 4 గ్రామాలు నియంత్రణ రేఖకు సమీపంలోనే ఉంటాయి. ఈ గ్రామాలకు చెందిన మహిళలు వ్యవసాయ పనులు చేసుకుంటారు. మగవాళ్లు ఇండియన్ ఆర్మీ క్యాంపుల వద్ద వివిధ పనులు చేసుకుంటూ సంపాదిస్తారు. ఈ ప్రజలను బ్రోక్పా తెగకు చెందిన వారుగా పిలుస్తారు.


సాధారణంగా కశ్మీర్‌, లడఖ్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు టిబెట్-మంగోలియన్ లుక్‌తో క‌నిపిస్తారు. కానీ ఈ బ్రోక్పా తెగ ప్రజలు మాత్రం ఇందుకు విరుద్ధం. ఈ తెగలో మగవాళ్లు ఆరు ఫీట్ల ఎత్తుకు తగ్గకుండా ఉంటారు. వీరి కళ్లు నీలి రంగులో ఉంటాయి. ఈ బ్రోక్పా తెగ వాళ్లే స్వచ్ఛమైన ఆర్యన్ జాతికి చెందిన వాళ్లని యూరోపియన్లు నమ్ముతున్నారు. ఇక్కడి అబ్బాయిల వ‌ల్ల తాము గ‌ర్భం దాలిస్తే.. త‌మ‌కు కూడా అంద‌మైన ఆర్యన్ సంతానం క‌లుగుతుంద‌ని భావిస్తున్నారు.

బ్రోక్పా తెగ‌కు చెందిన ప్రజలు నాలుగు గ్రామాల్లో కలిసి సుమారు 2 వేల మంది ఉన్నారు. వీళ్లు ప్రస్తుత పాకిస్థాన్‌లోని గిల్గిట్ ప్రాంతం నుంచి ఇక్కడికి వ‌చ్చిన‌ట్లు ఆ తెగ పెద్దలు చెబుతున్నారు. అయితే.. గ్రీకువీరుడు అలెగ్జాండర్‌ సైన్యంతో పాటు వారు ఇక్కడికి వచ్చి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు.

క్రీస్తుపూర్వం గ్రీకువీరుడు అలెగ్జాండ‌ర్ ఒక్కో రాజ్యాన్ని జ‌యిస్తూ.. భారత్‌పై దండయాత్రకు వచ్చాడు. సింధూ లోయ వ‌ర‌కు రాగానే అనారోగ్యానికి గుర్యాడు. దీంతో ఇండియాలోకి రాకుండానే తిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చనిపోయాడు. అలెగ్జాండర్ వెంట వ‌చ్చిన సైన్యంలో కొంత మంది అక్కడే ఉండిపోయారని కొంత మంది చరిత్రకారులు భావిస్తున్నారు. నాటి నుంచి వాళ్లు సింధూ లోయ‌లోనే నివసిస్తున్నారు. వాళ్లనే ఇప్పుడు చివ‌రి ఆర్యన్లుగా భావిస్తున్నారు.

ఆర్యన్ తెగకు చెందిన ఈ నాలుగు గ్రామాల ప్రజలు తమకు మాత్రమే సొంత‌మైన జ‌న్యుప‌ర‌మైన ప్రత్యేకతలను కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. త‌మ పూర్వీకుల గురించి ఎంతో గ‌ర్వంగా చెప్పుకుంటారు. మొదట్లో ఈ నాలుగు గ్రామాలలోకి టూరిస్టులను అనుమతించేవారు కాదు. ప్రభుత్వం 2010 నుంచి ఈ ప్రాంతానికి పర్యాటకులను అనుమతిస్తోంది. ఆ తర్వాత ‘ప్రెగ్నెన్సీ టూరిజం’ తెరపైకి వచ్చింది.

ఇక్కడ నివసిస్తున్నవారు ఆర్యన్లేనా? ప్రెగ్నెన్సీ టూరిజం నిజ‌మేనా? అని తెలుసుకోవ‌డానికి చాలా మంది జ‌ర్నలిస్టులు ప్రయ‌త్నించారు. అక్కడి తెగ వారిని కలిసి కథనాలు రాశారు. శ్రీనగర్‌లోని కశ్మీర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ మంజూర్ అహ్మద్ ఖాన్.. బ్రోక్పా తెగకు చెందిన ప్రజలపై ప్రత్యేక పరిశోధన చేశారు. ప్రెగ్నెన్సీ టూరిజం గురించి, ఇక్కడి తెగకు చెందిన ప్రజల గురించి కొత్త విషయాలు విని 2017లో అక్కడికి వెళ్లారు. ఏడాది పాటు అధ్యయనం చేశారు. 2018 ఫిబ్రవరిలో తన పరిశోధనకు సంబంధించిన జర్నాల్‌ను సమర్పించారు. దీంతో ఈ ప్రాంతం, ఇక్కడి ప్రజలకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ప్రపంచానికి తెలిశాయి.





Untitled Document
Advertisements