అకౌంట్ డీయాక్టిట్ అయ్యిందా?...డబ్బులు ఎలా తీసుకోవాలో తెలుసా?

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 05:38 PM

అకౌంట్ డీయాక్టిట్ అయ్యిందా?...డబ్బులు ఎలా తీసుకోవాలో తెలుసా?

మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను దీర్ఘకాలంపాటు ఉపయోగించకపోతే మీ అకౌంట్ డార్మెంట్ అకౌంట్‌ కిందకు వెళ్లిపోతుంది. అంటే మీ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇలాంటి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బులను కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.
బ్యాంకుల్లో కూడా ఇలాంటి అన్‌క్లెయిమ్డ్ అకౌంట్లు పెరుగుతూనే వస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఇలా ఎందులోనైనా అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ ఉండొచ్చు. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు వారి ఖాతాల్లో పదేళ్లపాటు ఎలాంటి ట్రాన్సాక్షన్ నిర్వహించకపోతే అప్పుడు ఆ అకౌంట్లలోని డబ్బు అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ అవుతుంది. 2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకుల్లో రూ.18,380 కోట్ల అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది.

మీరు కూడా బ్యాంక్‌లో డీయాక్టివేట్ అయిన అకౌంట్ కలిగి ఉంటే.. ముందు మీరు బ్యాంక్ బ్రాంచుకు మెయిల్ పంపించండి. ఇన్‌యాక్టివ్‌లో ఉన్న అకౌంట్‌ను రీయాక్టివ్ చేయాలి కోరాలి. దీని కోసం మీరు ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ వంటివి అందించాలి. మీరు ఇలా రిక్వెస్టె పెట్టుకున్న కొన్ని రోజుల తర్వాత మీ అకౌంట్ రీయాక్టివేట్ అవుతుంది.
అయితే బ్యాంకులు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో కేవైసీ అప్‌డేట్ చేయకపోవచ్చు. ఇలాంటప్పుడు మీరు బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అయితే డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా వారి అకౌంట్‌ను మళ్లీ యాక్టివేట్ చేసుకునే ఛాన్స్ ఉంది.





Untitled Document
Advertisements