వరుసగా రెండో ఏడాది అమ్మ ఒడి పథకం ప్రారంభం...విద్యార్థులపై జగన్ వరాల జల్లు

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 06:05 PM

వరుసగా రెండో ఏడాది అమ్మ ఒడి పథకం ప్రారంభం...విద్యార్థులపై జగన్ వరాల జల్లు

వరుసగా రెండో ఏడాది అమ్మ ఒడి పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యార్తులపై మరిన్ని వరాల జల్లులు కురిపించాడు. ఏపీలో వరుసగా రెండో ఏడాది సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది వైసిపీ ప్రభుత్వం. నవరత్నాల్లో ముఖ్యమైన జగనన్న అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరులో ప్రారంభించారు.
అమ్మ ఒడి పధకం ప్రారంభించిన తర్వాత జగన్ విద్యార్థులకు మరికొన్ని వరాలు ప్రకటించారు. వచ్చే ఏడాది నుండి తలులకు అమ్మ ఒడి తరుకు డబ్బులు కావాలంటే డబ్బులు, డబ్బు వద్దు అనుకుంటే ప్రత్యామ్నాయంగా ల్యాప్‌టాప్‌లు కావాలంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒక్కో ల్యాప్‌టాప్‌ ధర రూ. 25వేల నుంచి రూ.27వేలు ఉంటుందని.. సాధ్యమైనంత తక్కువ ధరకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ల్యాప్‌టాప్‌లకు మూడేళ్లు వారంటీ.. పాడైతే వారంలో రీప్లేస్ చేస్తామన్నారు. వసతి దీవెన అందుకుంటూ వసతి గృహాలలో ఉంటున్న వారికీ సైతం ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. గతకొంత కాలంగా కోవిడ్ నేపద్యంలో తరగతులు ఆన్లైన్ లో నిర్వహిస్తుండడంతో పేదింటి పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని మార్చాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీస్కునట్లు జగన్ ప్రకటించాడు. అలాగే ప్రతి స్కూల్ లోను ఎనిమిదో తరగతి నుంచి కంప్యూటర్ కోర్సును కూడా ప్రవేశపెడతామన్నారు.. వచ్చే మూడేళ్లలో ప్రతి ఊరిలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అంగన్‌వాడీలను మార్చి వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-1, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-2లుగా మారబోతున్నాయన్నారు.


నాడు-నేడు బడి అంటూ విద్యారంగంలో వినుత్నమైన మార్పులు తెస్తున్నామన్నారు సీఎం జగన్. ఇక నుంచి పిల్లలు ఒక్కరోజు స్చూల్కి వెళ్లకపోయినా వెంటనే తల్లిదండ్రులకు ఫోన్‌లో మెసేజ్ వస్తుంది.. రెండ్రోజులు వెళ్లకపోతే మూడో రోజు నేరుగా వాలంటీర్ ని ఆ పిల్లవాడి ఇంటికి పంపి ఆ పిల్లల యోగ క్షేమాల గురించి అడిగి విచారణ చేస్తారని..పిల్లల్ని బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులది అయితే.. పిల్లలు బడికి రాకపోతే తల్లిదండ్రులకు నచ్చజెప్పే బాధ్యత గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, తల్లిదండ్రులు కమిటీ, టీచర్ల మీద పెడుతున్నామన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ అగ్ర కులాల పేదలకు చదువుకునే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకునేలా వచ్చే మూడేళ్లు ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతున్నామన్నారు. నాడు-నేడు బడి రూపు రేఖలు మారుస్తున్నామన్నారు.





Untitled Document
Advertisements