జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉచితనీరు ....మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 06:09 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉచితనీరు ....మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే

ప్రతీ ఇంటికి 20వేల లీటర్ల వరకు ఉచిత నీరు అందిస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే డొమెస్టిక్ యూజర్లకు మాత్రం తప్పనిసరిగా మీటర్ ఉండాల్సిందే.

తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికలలో నగర వాసులకు ప్రతీ ఇంటికి 20వేల లీటర్ల వరకు ఉచిత నీరు అందిస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం విధితమే. గ్రేటర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) ప‌రిధిలో ఉచితంగా నీరును అందించే ప‌థ‌కానికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్రభుత్వం విడుద‌ల చేసింది. ఈ పథకానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. బస్తీలలో మాత్రం నల్లాలకు మీటర్లు లేకున్నా డాకెట్ ఆధారంగా బిల్లు వసూలు చేయ‌నున్నారు. అపార్టుమెంట్లలో మీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విధించింది స‌ర్కార్. అయితే ఈ ప‌థ‌కం ద్వారా 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఉచితంగా అంద‌నుండ‌గా.. 20 వేల లీటర్లు దాటి నీటి వినియోగంపై విధించే పాత ఛార్జీలతో బిల్లు వ‌సూలు చేయ‌నున్నారు. సిటీలో ఉన్న స్లమ్.. బస్తీ ఏరియాలో ఉన్న నల్లా కనెక్షన్లకు ఇకపై ఎలాంటి బిల్లు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది ప్ర‌భుత్వం. దీనికోసం వినియోగదారులు ప్రత్యేకంగా ఎలాంటి మీటర్లను బిగించుకోవాల్సిన అవసరం లేద‌ని క్లారిటీ ఇచ్చింది. ఇదిలావుండగా డొమెస్టిక్ యూజర్లు 20వేల ఫ్రీ వాటర్ పొందేందుకు తప్పనిసరిగా మీటర్ ఉండాల్సిందే. దీనికోసం సొంత ఖర్చులతోనే మీట‌ర్ బిగించుకోవాలని స్పష్టతనిచ్చింది. మీటర్ భిగించిన తరువాత నెలలో మీటర్ రీడింగ్ 20వేల లీటర్లు దాటితే ప్రస్తుతం చెల్లిస్తున్న టారీఫ్ ప్రకారం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.... అపార్టుమెంట్లలోని ప్లాట్ల లెక్కన ఒక్కో ఫ్లాటుకు 20వేల లీటర్ల చొప్పున మొత్తం ఫ్లాట్లకు మంచినీరు అందించనున్నారు... పది ఫ్లాట్లు ఉన్న అపార్టుమెంట్ కు 2లక్షల నీటిని ఉచితంగా సరఫరా చేసి... అంతకు మించిన నీటికి పాత టారీఫ్ లెక్కన బిల్లు వసూల్ చేయాలని నిర్ణయం తీసుకుంది ప్ర‌భుత్వం.





Untitled Document
Advertisements