గుడ్ న్యూస్...కారుపై రూ.40 వేల తగ్గింపు!!!

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 08:41 PM

గుడ్ న్యూస్...కారుపై రూ.40 వేల తగ్గింపు!!!

కొత్త కారు కొనేందుకు సిద్ధమౌతున్నారా? అయితే మీకు అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. కారు కొనుగోలుపై ఏకంగా రూ.40 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఇది అన్ని కార్లపై లభించదు. కేవలం డాట్సన్ కార్లపై అదిరిపోయే ఆఫర్లున్నాయి. జనవరి చివరి వరకే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
డాట్సన్ కంపెనీ తన కార్లపై పండుగ ఆఫర్లు అందిస్తోంది. డాట్సన్ గో, డాట్సన్ రెడిగో, డాట్సన్ గో ప్లస్ అనే మోడళ్లపై తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఏకంగా రూ.40 వేల వరకు బెనిఫిట్ లభిస్తోంది. డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ వంటివి ఇందులో కలిసి ఉంటాయి.
!
రెడిగో కారుపై రూ.35,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ.5 వేల కార్పొరేట్ ఆఫర్ ఉంది. దీని ధర ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.86 లక్షలు. అలాగే డాట్సన్ గో, గో ప్లస్ కార్లపై కూడా ఇదే ఆఫర్ ఉంది.
ఈ రెండు కార్లపై రూ.40 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్ రూ.20,000. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.20 వేల తగ్గింపు లభిస్తుంది. డాట్సన్ గో ఎక్స్‌షోరూమ్ ధర రూ.4 లక్షలు. అదే డాట్సన్ గో ప్లస్ ధర రూ.4.25 లక్షలు.





Untitled Document
Advertisements