డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్...ఆన్‌లైన్‌లోనే అప్లై చేయొచ్చు

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 08:47 PM

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్...ఆన్‌లైన్‌లోనే అప్లై చేయొచ్చు

మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే దీని వాలిడిటీ అయిపోవచ్చిందా? అయితే మీరు ఎక్కడికీ వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం అప్లై చేసుకోవచ్చు. కరోనా వైరస్ సమయంలో ఆన్‌లైన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవడం చాలా ఉత్తమం. అయితే ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్లి ఫింగర్‌ప్రింట్ వేయాల్సి ఉంటుంది.
దీని కోసం మీరు ముందుగా parivahan.gov.in అనే ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సర్వీసులు అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసులు ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి.

తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఆర్‌టీవో ఆఫీస్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆర్‌టీఓ ఆఫీస్‌లో మీ బయోమెట్రిక్స్ తీసుకుంటారు. వెరిఫికేషన్ తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ అవుతుంది. మీకు ఫామ్ డీ అవసరం అవుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫిల్ చేసి స్కాన్ చేసుకోండి. అప్‌లోడ్ చేయాలి.
అలాగే మీకు 40 ఏళ్లు దాటితే డాక్టర్ సర్టిఫికెట్ కూడా కావాలి. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు వంటివి కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ అయిపోయిన నెల రోజులలోగా రెన్యూవల్ చేసుకోవాలి. 30 రోజులు దాటితో జరిమానా పడుతుంది.





Untitled Document
Advertisements