బైక్ ధరలు పెంచేసిన బజాజ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలు

     Written by : smtv Desk | Tue, Jan 12, 2021, 09:43 AM

బైక్ ధరలు పెంచేసిన బజాజ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలు

కొత్త బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఝలక్. ప్రముఖ టూవీలర్ కంపెనీలు ఇప్పుడు వాటి బైక్స్ ధరలను పెంచేశాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పండుగకు ముందు బైక్ కొనాలని భావించే వారికి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన క్లాసిక్ 350, బుల్లెట్ బైక్స్ ధరలు పెంచింది. అంతేకాకుండా ఈ కంపెనీ ఇటీవలనే మార్కెట్‌లోకి తీసుకువచ్చిన మెటిరో 350 ధర కూడా పెంచింది. ఈ కంపెనీ దారిలోనే బజాజ్ ఆటో కూడా నడిచింది. బజాజ్ కూడా పలు బైక్స్ ధరలను పెంచేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పలు మోడళ్ల ధరను రూ.3,000 వరకు పెంచేసింది. క్లాసిక్, బుల్లెట్ బైక్స్ వంటి బైక్స్ ధర రూ.2 వేల వరకు పైకి చేరింది. అదే మెటిరో 350 ధర మాత్రం రూ.3 వేలు పెరిగింది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కొనే వారికి ఝలక్ తగిలిందని చెప్పుకోవచ్చు.
బజాజ్ ఆటో విషయానికి వస్తే.. అవెంజర్ క్రూయిజర్ 220 బైక్ ధరతోపాటు పల్సర్ బైక్ ధర, డామినర్ బైక్ ధర పైకి చేరాయి. అవెంజర్ క్రూయిజర్ బైక్ ధర రూ.3500 పైకి చేరింది. డామినర్ 400 బైక్ ధర రూ.3480 పెరిగింది. అదే డామిన్ 250 బైక్ ధర రూ.3500 పెరిగింది. బజాజ్ పల్సర్ 220ఎఫ్ ధర కూడా ఇదే స్థాయిలో పెరిగింది. పల్సర్ ఎన్ఎస్ ధర రూ.3 వేలు పైకి చేరింది.





Untitled Document
Advertisements