సింగర్ సునీతను సర్‌ప్రైజ్ చేసిన సుమ...ప్రియనేస్తం పెళ్లి కానుకగా అత్యంత ఖరీదైన బహుమతి

     Written by : smtv Desk | Wed, Jan 13, 2021, 01:05 PM

సింగర్ సునీతను సర్‌ప్రైజ్ చేసిన సుమ...ప్రియనేస్తం పెళ్లి కానుకగా అత్యంత ఖరీదైన బహుమతి

ఇటీవలే సింగర్ సునీత- రామ్ వీరపనేని మూడు మూళ్ళ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయిన యాంకర్ సుమ.. సునీతకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం.

కరోనా నేపద్యంలో ప్రజలు దాదాపు ఇళ్ళకు పరిమితం అయిన వేళ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాకి అత్తుకుపోయారు. అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తమ తమ అభిమాన తారల పెళ్లి విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు ప్రేక్షకులు. వరుసగా సినీతారల పెళ్లి తాలుకు ఫోటోలు నేట్టింట సందడి చేస్తుండగా ....గత నెల డిసెంబర్‌లో మెగా డాటర్ నిహారిక పెళ్లి సంగతులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వగా ....ఈ నెల జనవరిలో సునీత పెళ్లి తాలూకు విషయాలు వైరల్ అవుతున్నాయి. జనవరి 9వ తేదీన ప్రముఖ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో సునీత పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. అయితే సునీత పెళ్లి వేడుకలో యాంకర్ సుమ ఆమెకు ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిందని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది.

15 ఏళ్ళ వయసులోనే ప్లేబ్యాక్ సింగర్‌గా మైక్ అందుకున్న సునీత.. ఆ తర్వాత పలు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి, స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్తూ కెరీర్‌లో అందనంత ఎత్తుకు ఎదిగింది. ఆమె చేసిన ఈ జర్నీలో ఎందరో సినీ సెలబ్రిటీలతో క్లోజ్ అయింది. ఈ క్రమంలోనే సునీత, యాంకర్ సుమ మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లా ఉంటూ స్నేహబంధం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన ప్రియనేస్తం పెళ్లి కానుకగా అత్యంత ఖరీదైన వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చి సునీతను సర్‌ప్రైజ్ చేసిందట సుమ.

దాదాపు 25 సంవత్సరాల స్నేహబంధం వీరిది. పైగా వీళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. అందుకే సునీత పెళ్ళికి సుమ తన భర్త రాజీవ్ కనకాలతో పాటు హాజరై తెగ సందడి చేసింది. ఇక ఓ స్నేహితురాలి పెళ్లి కానుకగా ఏకంగా వజ్రాల హారాన్ని బహుమతిగా ఇవ్వడమంటే వీళ్లిద్దరి బాండింగ్ ఎంతలా ఉండిఉంటుందో అని చెప్పుకుంటున్నారు జనం.





Untitled Document
Advertisements