చిలగడదుంప ఖీర్...పండగ స్పెషల్ రెసిపీ

     Written by : smtv Desk | Wed, Jan 13, 2021, 01:09 PM

చిలగడదుంప ఖీర్...పండగ స్పెషల్ రెసిపీ

పండుగ అంటేనే స్వీట్స్.. ఈ స్వీట్స్‌ని బయటినుంచి కొనుక్కున్నవి కాకుండా మనమే ఇంట్లోనే తయారు చేస్తే హైజినిక్, టెస్ట్, ఇంకా హెల్త్ కి కూడా మంచిదే... ప్రస్తుతం సంక్రాంతి పండగ వేళ చల్లటి చలిలో విరివిగా లభించే చిలగడ దుంపల గురించి తెలియని వాళ్ళు ఉండరు. అయితే ఈ దుంపని నేరుగా ఉడికించి తినడమే కాకుండా రకరకాల వెరైటీ స్వీట్స్ చేస్కోవచ్చు... కాబట్టి.. చిలగడదుంపతో ఓ మంచి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం.. అదే చిలగడదుంప పాయసం.. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

1 కప్ ఉడకబెట్టడం చిలగడదుంప
1 కప్ తురిమిన టెంకాయ
1/2 కప్ బెల్లం
అవసరాన్ని బట్టి నీళ్ళు
అలంకారానికి
10 జీడిపప్పు
10 ఎండు ద్రాక్ష
10 బాదాం పప్పు
కొద్దిగా యాలకులపొడి
2 టీ స్పూన్ నెయ్యి

ముందుగా మిక్సర్‌లో తురిమిన కొబ్బరి, బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి అన్ని పదార్థాలను మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత, జీడిపప్పు బాదంపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు ఎండుద్రాక్ష వేసి ఒక నిమిషం వేయించాలి. పప్పులను తీసివేసి పక్కన ఉంచండి. తరువాత అదే పాన్‌లో ఉడికించిన చిలగడదుంపలను వేసి మెత్తగా చిదమాలి. ఇప్పుడు అందులోనే గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి బాగా ఉడకబెట్టండి. దీనిలో యలకులు వేసి 3 నిమిషాల పాటు ఉడికించండి. స్టవ్ కట్టేసిన తరువాత ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు,బాదంపప్పు, ఎందుద్రాక్షలతో గార్నిష్ చేయండి. ఇలా తయారైన ఖీర్‌ని వేడివేడిగా సర్వ్ చేయండి..





Untitled Document
Advertisements