అమెరికాలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇలా చేయండి!

     Written by : smtv Desk | Sat, Jan 16, 2021, 08:25 AM

అమెరికాలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇలా చేయండి!

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మన దేశంలో కాదండోయ్.. విదేశాల్లో అది కూడా అగ్రరాజ్యం అమెరికాలో బ్యాంక్ ఖాతా తెరవాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఈ పని మీ ఇంటి నుంచే పూర్తి చేయొచ్చు. అదేంటి మన ఊరిలో ఉన్న బ్యాంక్‌లో ఖాతా తెరవాలంటేనే బ్యాంక్‌కు తిరగాల్సి వస్తుంది కదా.. అలాంటిది అమెరికాలో బ్యాంక్ అకౌంట్ తెరవడం సాధ్యమౌతుందా? అని మీరు ఆలోచిస్తు్న్నారా?

అయితే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే. మీరు మీ ఇంట్లో నుంచే అమెరికాలో బ్యాంక్ ఖాతా తెరవొచ్చు. అమెరికాకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ ఎల్డ్రా ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తోంది. మీకు అమెరికాలో అడ్రస్ లేకుండానే మీరు అక్కడ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయొచ్చు.


అయితే మీరు అమెరికాలో బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. ఇండియన్ పాస్‌పోర్ట్‌ సహా ఇతర కేవైసీ డాక్యుమెంట్ల ద్వారా మీరు అమెరికాలో బ్యాంక్ ఖాతా తెరవొచ్చు. రోజుకు దాదాపు 30 అకౌంట్లు తెరుస్తున్నామని ఎల్డ్రా తెలిపింది.


తమ ద్వారా 5 వేల మంది కస్టమర్లు అమెరికాలో బ్యాంక్ ఖాతా తెరవడానికి వెయిట్ లిస్ట్‌లో ఉన్నారని ఎల్డ్రా ఫౌండర్, సీఈవో సుకీర్త్ శంకర్ తెలిపారు. బ్యాంక్ అకౌంట్‌తోపాటు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డు 2.5 లక్షల డాలర్ల ఇన్సూరెన్స్ కూడా అందిస్తాయని పేర్కొన్నారు.

ఇకపోతే అమెరికాలో బ్యాంక్ అకౌంట్ చేసే వారికి అకౌంట్ మెయింటెనెన్స్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు వంటి సర్వీసులు అన్ని ఉచితంగానే లభిస్తాయని ఆయన తెలిపారు. ఈ సర్వీసులకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ఎల్ట్రా సంస్థ బ్లూ రిడ్జ్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మీరు ఎల్ట్రా వెబ్‌సైట్‌కు వెళ్లి ఖాతా ఓపెన్ చేయొచ్చు.





Untitled Document
Advertisements