తల్లికి తగ్గ కూతురు.... పేద పిల్లల్ని చదివిస్తున్న రోజా కూతురు

     Written by : smtv Desk | Sat, Jan 16, 2021, 08:47 AM

తల్లికి తగ్గ కూతురు.... పేద పిల్లల్ని చదివిస్తున్న రోజా కూతురు

‘‘అమ్మా.. నువ్ ఓటర్లకు ఎమ్మెల్యే కావచ్చు.. ప్రేక్షకులకు హీరోయిన్‌వీ కావచ్చు.. మాకు మాత్రమే అమ్మవి కదా.. నీతో ఉండాలని.. నీతో గడపాలని.. నీ చేతి వంట తినాలని మాకూ ఉంటుంది కదమ్మా..’’ అని నా పిల్లలు అంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకూ నా పిల్లలతో ఉండటానికి ఇష్టపడతాను.. ఈ లాక్ డౌన్‌లో నా పిల్లలతో ఎక్కువ టైం గడిపి వాళ్లకి ఇష్టమైనవి వండి పెట్టడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ అమ్మ ప్రేమను తలచుకుని ఎమోషనల్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరోయిన్ రోజా సెల్వమణి.

సంక్రాంతి పండుగ సందర్భంగా అభిమానులతో ముచ్చటించిన రోజా.. రాజకీయాలను పక్కన పెట్టి.. తన పిల్లలు, ఫ్యామిలీ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా తన కూతురు అన్షు చేస్తున్న మంచి పనులు గురించి చెప్పుకుని మురిసిపోయారు రోజా.
అమ్మాయి సోషల్ సర్వీస్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.. హైదరాబాద్‌లోని ఛీర్స్ ఫౌండేషన్‌లో ఐదుగురుని చదివిస్తోంది. వాళ్లకి సంబంధించిన పూర్తి బాధ్యతను నా కూతురు అన్షు తీసుకుంది. తన బర్త్ డేకి ఆ ఫౌండేషన్‌కి వెళ్లి.. అక్కడ వాళ్లతో సెలబ్రేట్ చేసుకుని వాళ్లలో ఐదుగుర్ని తనే సెలెక్ట్ చేసుకుని చదివిస్తోంది. మేం మొన్నటి వరకూ మణికొండలో ఉండేవాళ్లం. మా చుట్టుపక్కల కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది. వలస వచ్చిన భవన కార్మికుల పిల్లల్ని ఇంటికి తీసుకుని వచ్చి వాళ్లకి భోజనం పెట్టి.. చదువుకోవడానికి స్టేషనరీ పంచేది.. కొంతమందికి చదువు చెప్పించడం లాంటివి చేసింది.
డొనేషన్స్ కలెక్ట్ చేసి స్కూల్స్‌కి ఇవ్వడం.. మనకి ఉన్నదాంట్లో కొంత ఇవ్వాలమ్మా అని నా కూతురు నాకే చెప్తోంది. ఈ మధ్యనే బుక్స్ రాయడం మొదలుపెట్టింది. తను రాసిన బుక్ పబ్లిష్ అయ్యే వరకూ నాకు కూడా తెలియకుండా సీక్రెట్‌ మెయిన్‌టైన్ చేసి థ్రిల్ చేసింది. తన ఎక్కడికీ వెళ్లదు.. ఎప్పుడూ చదువే అంటుంది. తనకి చదువు అంటే చాలా ఇష్టం. అదే ప్రపంచం. ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటుంది. మాకెవరికీ బుక్స్ రాసే అలవాటు లేదు... నా కూతురు బుక్ పబ్లిష్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో పుస్తకం కూడా రాస్తుంది. సింగర్ అవ్వాలి.. పాటలు పాడాలని అంటుంది. ఏమౌతుందో చూద్దాం’ అంటూ తన కూతురు అన్షు గురించి చెప్పుకొచ్చింది హీరోయిన్, ఎమ్మెల్యే రోజా.





Untitled Document
Advertisements