మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్‌తో ఒప్పో ఏ94 స్మార్ట్ ఫోన్ లాంచ్

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 05:08 PM

మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్‌తో ఒప్పో ఏ94 స్మార్ట్ ఫోన్ లాంచ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన ఏ94 స్మార్ట్ ఫోన్‌ను సైలెంట్‌గా లాంచ్ చేసింది. గతేడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన ఒప్పో ఏ93కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది, ఇందులో మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్‌ను అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4310 ఎంఏహెచ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా తెలపలేదు. కానీ ఒప్పో యూఏఈ వెబ్ సైట్లో ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఈ ఫోన్ మనదేశంలో ఒప్పో ఎఫ్19గానూ, ఇతర ఆసియా దేశాల్లో ఒప్పో రెనో 5ఎఫ్‌గానూ, ఒప్పో ఏ94 పేరుతో యూరోప్‌లోనూ లాంచ్ అయ్యే అవకాశం ఉందని ప్రముఖ టిప్ స్టర్ ఇవాన్ బ్లిస్ తెలిపారు. ఇందులో 5జీ వేరియంట్ కూడా ఉందని.. అది ఒప్పో ఏ94 లేదా ఒప్పో ఎఫ్19 ప్రో పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన సేల్ ఎప్పటినుంచి జరగనుందో కూడా కంపెనీ తెలపలేదు. మార్చి 11వ తేదీన ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ అయిన తర్వాత దీని సేల్ కంపెనీ ప్రారంభించే అవకాశం ఉందని ఇవాన్ బ్లిస్ పేర్కొన్నారు.

ఇందులో 6.43 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించనున్నారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పొర్ ట్రెయిట్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. ముందువైపు హోల్ పంచ్ కటౌట్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఒప్పో అందించింది.

ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4310 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 4జీ ఎల్టీఈ, ట్రిపుల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి.


Oppo A94:

పెర్ఫార్మెన్స్ MediaTek Helio P95
స్టోరేజ్_ఫైల్ 128 GB
బ్యాటరీ 4015 mAh
price_in_india 23990
డిస్_ప్లే 6.43 inches (16.33 cm)
ర్యామ్ 8 GB





Untitled Document
Advertisements