రియల్ మీ 8 ప్రో స్పెసిఫికేషన్లు లీక్

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 06:07 PM

రియల్ మీ 8 ప్రో స్పెసిఫికేషన్లు లీక్

రియల్ మీ 8 ప్రో స్మార్ట్ ఫోన్ యూఎస్ ఎఫ్‌సీసీ లిస్టింగ్‌లో కనిపించింది. దీని స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్ లైన్‌లో లీకయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన రియల్ మీ 7 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్లు రానున్నాయి. ఈ రెండు ఫోన్లను కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ టీజ్ చేశారు. ఎఫ్‌సీ‌సీ లిస్టింగ్‌లో ఈ ఫోన్ 65W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌తో కనిపించింది. రియల్ మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. రియల్ మీ 8, రియల్ మీ 8 ప్రో స్మార్ట్ ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్ ఇప్పటికే RMX3081 మోడల్ నంబర్‌తో పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. ఇది రియల్ మీ 8 ప్రో అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రియల్ మీ 8 ప్రోలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నట్లు, 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్ మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుందని ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ లిస్టింగ్‌ను మొదట ప్రముఖ టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ గుర్తించారు. రియల్ మీ సీఈవో మాధవ్ సేథ్ కూడా దీని రిటైల్ బాక్స్ ఫొటోను షేర్ చేశారు. దీనికి సంబంధించిన పలు స్పెసిఫికేషన్లు కూడా ఆయన తెలిపారు. వీటి ప్రకారం ఇందులో 6.4 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. రియల్ మీ 8లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీన్ని బట్టి చూస్తే రియల్ మీ 8 ప్రోలో దీని కంటే చిన్న బ్యాటరీ., దాదాపు రెట్టింపు చార్జింగ్ స్పీడ్ ఉండనుంది. రియల్ మీ 8 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్‌ను అందించనున్నారు. రెడ్ మీ నోట్ 10 సిరీస్‌కు ఈ స్మార్ట్ ఫోన్లు పోటీ ఇవ్వనున్నాయి. అందులో టాప్ ఎండ్ ఫోన్ అయిన రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. రియల్ మీ 8 సిరీస్ ధర కూడా రూ.20 వేల లోపు ఉండే అవకాశం ఉంది. కాబట్టి రూ.20 వేలలో మంచి ఫోన్ కొనాలనుకునేవారు రియల్ మీ 8 ప్రో కూడా వచ్చేదాకా ఆగి వాటిలో బెస్ట్ ఫోన్ ఎంచుకోవచ్చు.








Untitled Document
Advertisements