ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 06:10 PM

ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్

ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 9న డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనుంది. 52 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా.. చెన్నై, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ సిటీలు మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే.. ఈ ఏడాది హైదరాబాద్‌లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌ కూడా జరగడం లేదు. మే 30న ఫైనల్‌కి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.

1) ఏప్రిల్ 11న చెన్నై వేదికగా కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకి మ్యాచ్

2) ఏప్రిల్ 14న మళ్లీ చెన్నైలోనే బెంగళూరుతో రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ ఆడనుంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి

3) ఏప్రిల్ 17న చెన్నై వేదికగానే ముంబయితో హైదరాబాద్ ఢీ. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి

4) ఏప్రిల్ 21న చెన్నైలోనే కింగ్స్ పంజాబ్‌తో సన్‌రైజర్స్ ఫైట్. మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకి

5. ఏప్రిల్ 25న ముంబయి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ ఢీ. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి

6. ఏప్రిల్ 28న ఢిల్లీ వేదికగా చెన్నైతో హైదరాబాద్ ఫైట్. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి

7. మే 2న మళ్లీ ఢిల్లీ వేదికగానే రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ ఢీ. మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకి

8. మే 4న ఢిల్లీ వేదికగా ముంబయితో హైదరాబాద్ ఢీ. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి

9. మే 7న ఢిల్లీ వేదికగానే చెన్నైతో హైదరాబాద్ ఢీ. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి

10. మే 9న కోల్‌కతా వేదికగా బెంగళూరుతో హైదరాబాద్ ఢీ. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి

11. మే 13న కోల్‌కతా వేదికగా రాజస్థాన్‌తో హైదరాబాద్ ఢీ. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి

12. మే 17న కోల్‌కతా వేదికగానే ఢిల్లీతో హైదరాబాద్ ఢీ. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి

13. మే 19న బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో హైదరాబాద్ ఢీ. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి

14. మే 21న బెంగళూరు వేదికగానే కోల్‌కతాతో హైదరాబాద్ ఢీ. మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకి.





Untitled Document
Advertisements