జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో బన్నీ సినిమా!

     Written by : smtv Desk | Tue, Mar 09, 2021, 11:01 AM

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో బన్నీ సినిమా!

బన్నీ ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఆగస్టు లో ఈ సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేసిన నేపథ్యంలో గ్యాప్ లేకుండా షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో ఉంది యూనిట్. బన్నీ కెరీర్ లోనే పుష్ప మొదటి పాన్ ఇండియా సినిమా. 170 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది.
మారేడు మిల్లి ఫారెస్ట్ లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్.. ఇప్పుడు తమిళనాడులో షూటింగ్ జరుపుకుంటుంది. గంధపు చెక్కల స్మగ్లర్ గా మొరటుగా కనిపించనున్నాడు బన్నీ. ఈ సినిమా తర్వాత బన్నీ, కొరటాల డైరక్షన్ లో నటించనున్నాడు. ఆచార్య తర్వాత బన్నీ సినిమా స్క్రిప్ట్ పైనే వర్క్ చేయనున్నాడు కొరటాల.
అయితే కొరటాల సినిమా తర్వాత బన్నీ ఏ డైరక్టర్ తో పనిచేయనున్నాడనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్లీ రావా, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో బన్నీ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే బన్నీ కోసం గౌతమ్ ఫుల్ స్ర్కిప్ట్ ను కూడా రెడీ చేశాడని, త్వరలోనే బన్నీకి ఫుల్ నెరేషన్ ఇవ్వనున్నాడని, మంచి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో నడవనున్న ఈ స్టోరీ నచ్చితే ఈ దీపావళికి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందంటున్నారు బన్నీ సన్నిహితులు. ప్రస్తుతం గౌతమ్ జెర్సీ హిందీ రీమేక్ లో ఉన్నాడు. బన్నీ తో సినిమా ఓకే అయితే, జెర్సీ రీమేక్ ఫినిష్ చేసిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది.





Untitled Document
Advertisements