కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్

     Written by : smtv Desk | Tue, Mar 09, 2021, 11:05 AM

కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్

‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. అంటే.. అన్ని ఇంద్రియాలకంటే కళ్లే ముఖ్యమైనవని అర్థం. అయితే, మనం కళ్ల విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటాం. కళ్ళ ఒత్తిడిని తగ్గించుకోవడం, వాటిని ఆరోగ్యంగా కాపాడుకోవడం చాల ముఖ్యం. అయితే, ఈ కింది సూపర్ ఫుడ్స్‌ను తీసుకోవడం ద్వారా మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవేంటో చూసేయండి మరి.
1. చిక్కుళ్లు లేదా బీన్స్: చిక్కుళ్లు, కిడ్నీ బీన్స్, కాయధాన్యాలు గురించి మీకు తెలుసా? వీటిని మీరు తప్పకుండా మిస్ కాకుండా తీసుకోండి. ఇందులో ఉండే బయోఫ్లావనాయిడ్స్, జింగ్ మీ రెటీనా‌ను కాపాడతాయి. కంటిశుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని, కంటి నల్ల మచ్చలను తగ్గిస్తాయి.
2. నట్స్, సన్ ఫ్లవర్ విత్తనాలు: కళ్లు ఆరోగ్యం ఉంచడంలో నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వాల్‌నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ ఉంటాయి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. పోషకాలతోపాటు విటమిన్-ఇ తీసుకోవడం వల్ల ఏజ్ రిలేటెడ్ మస్క్యులర్ డీజనరేషన్ (AMD) సమస్య తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.
3. పచ్చని ఆకు కూరలు: పిల్లలకు బాల్యం నుంచే ఆకు కూరలు తినడం అలవాటు చేయాలి. అప్పుడే వారి కళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. బచ్చలి, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో విటమిన్-సి, ఇ అధికం. మొక్కల్లాంటి ఆకు కూరల్లో విటమిన్-ఎ శాతం ఎక్కువ. కాబట్టి.. మీరు తీసుకొనే డైట్‌లో తప్పకుండా ఆకు కూరలు ఉండేలా చూసుకోండి. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. వయస్సు మీదపడినా సరే కంటి చూపు మందగించదు.
4. రంగు రంగుల కాయగూరలు, పండ్లు: మన కళ్లు ప్రకాశవంతమైన దృశ్యాలను చూసినప్పుడు మెదడుకు సరైన సిగ్నళ్లను పంపుతాయి. క్యారెట్, టమోటో, పెప్పర్స్, స్ట్రాబెర్రీస్, గుమ్మడి, మొక్క జొన్నల్లో విటమిన్-ఎ, విటమిన్-సి ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను దరిచేరకుండా కాపాడతాయి.
5. పుల్లగా ఉండే పండ్లు: పుల్లని పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఆరెంజ్, ద్రాక్ష పండ్లు, నిమ్మ, బెర్రీస్‌లో ఇది లభిస్తుంది. ఇది కంటిశుక్లం (Cataract), మాక్యులర్ క్షీణత సమస్య దరిచేరకుండా కళ్లను కాపాడుతుంది. ఇకపై మీ డైట్‌లో తప్పకుండా ఇవి ఉండేలా చూసుకోండి.





Untitled Document
Advertisements