గంగూలీ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ?

     Written by : smtv Desk | Tue, Mar 09, 2021, 11:15 AM

గంగూలీ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ?

సినిమా తారలు, స్పోర్ట్స్ పర్సన్స్ రాజకీయ రంగప్రవేశం చేయడం కొత్తేం కాదు. అయితే, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా దాదాని ఓ రెండు మూడు సందర్భాల్లో కలవడం, బీజేపీ నేతలు కూడా అతనితో సంప్రదింపులు జరపడంతో.. ఈ ఏడాది గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని అంతా ఊహించారు.
అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్‌ని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాంతో.. మరోసారి గంగూలీ పొలికల్ ఎంట్రీపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో.. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా..? అని ఓ ఇంటర్వ్యూలో దాదాని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. పశ్చిమ బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకూ ఎనిమిది దశలో పోలింగ్ జరగనుంది.
‘‘జీవితం ఎక్కడికి వెళ్తుందో.. ఏం జరుగుతుందో చూడాలి. రాజకీయ పార్టీలు నాపై శ్రద్ధ చూపుతున్నాయి. కానీ.. నాకు ఇప్పుడు అటువైపు వెళ్లే ఆలోచన లేదు. కోల్‌కతా సిటీలో సాధారణ జీవితం గడపాలని ఆశిస్తున్నా. చాలా మంది ప్రజల్ని కలుస్తున్నాను. వారితో మాట్లాడుతున్నా.. వారి కోసం కాస్త సమయం కేటాయించగలుగుతున్నా. క్రికెట్ పరంగా ప్రస్తుతానికి నాకు అప్పగించిన బాధ్యతని నిర్వర్తిస్తున్నా’’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ స్పష్టం చేశాడు.





Untitled Document
Advertisements