చిరుని పక్కనపెట్టిన దర్శకుడు

     Written by : smtv Desk | Tue, Mar 09, 2021, 11:44 AM

చిరుని పక్కనపెట్టిన దర్శకుడు

ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ ఎఫ్3 మరియు గని సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఈ రెండు సినిమాలు చేస్తూనే మరోవైపు కొత్త సినిమాలకు కూడా కమిట్ అవుతూ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం భీష్మతో సూపర్ హిట్ అందుకున్నవెంకీ కుడుమల దర్శకత్వంలో వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసిన దర్శకుడు వెంకీ.. త్వరలోనే వరున్ తో సినిమా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
ఛలో, భీష్మ లతో ఫుల్ జోష్ లో ఉన్న వెంకీ మరి వరుణ్ తో కూడా ఆ సక్సెస్ ఫార్ములాని కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి. గతంలో మెగాస్టార్ కు కూడా వెంకీ కుడుమల స్టోరీ నెరేట్ చేశాడని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు చిరూ తో కాకుండా వరుణ్ తో సినిమా ఫైనల్ అయిందంటున్నారు. ఇటీవల మహేష్ , రామ్ పోతినేని తో కూడా వెంకీ సినిమా ఉండనుంది అని ప్రచారం జరిగింది కానీ చివరకు వెంకీ కుడుమల వరుణ్ దగ్గర ఆగాడని.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.





Untitled Document
Advertisements