స్టీల్ ప్లాంట్ పై కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి

     Written by : smtv Desk | Tue, Mar 09, 2021, 11:47 AM

స్టీల్ ప్లాంట్ పై కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి ఏమాత్రం సంబంధమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని స్పష్టం చేశారు. ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలూ లేవని స్పష్టం చేశారు. వందకు వంద శాతం పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని, మద్దతు కూడా అడిగినట్లు ఆమె వెల్లడించారు.
మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతోంది. దీనిలో అధికార, విపక్ష పార్టీ నేతలందరూ పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రిందటే రాష్ట్రవ్యాప్త బంద్‌ను కూడా ప్రతిపక్షాలు నిర్వహించాయి. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ తాము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, ఉద్యమం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements