బిట్‌కాయిన్‌పై దృష్టి సారించిన ఐటి...

     Written by : smtv Desk | Wed, Dec 13, 2017, 02:49 PM

బిట్‌కాయిన్‌పై దృష్టి సారించిన ఐటి...

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశవ్యాప్తంగా ఉన్న వర్చువల్‌ కరెన్సీ బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీలపై ఐటి శాఖ సర్వే చేపట్టింది. ఈ రోజు ఉదయం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, కోచి, గురుగ్రామ్‌ సహా 9 బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీ కార్యాలయాలకు ఐటీ అధికారులు వెళ్లి ట్రేడర్ల వివరాలు, వారి లావాదేవీలు సేకరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇటీవల బిట్ కాయిన్ విలువ రూ.10లక్షలు దాటిన విషయం తెలిసిందే. ఈ సర్వే చేయడానికి గల ప్రధాన కారణం మదుపర్లు మోసపోకుండ ఉండాలని ఐటి శాఖ పేర్కొంది. ఇలాంటి వర్చువల్‌ కరెన్సీలపై పెట్టుబడిదారులు, ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సూచించింది.





Untitled Document
Advertisements