సొంత చెల్లిపై అన్న అత్యాచారం...పెద్దమ్మ కొడుకు కూడా!!!

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 11:54 AM

సొంత చెల్లిపై అన్న అత్యాచారం...పెద్దమ్మ కొడుకు కూడా!!!

మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది. బస్సులు, రైళ్లు, నడిరోడ్డుపైనే కాదు.. అమ్మాయిలు తమ సొంత వాళ్ల మధ్యలో కూడా క్షేమంగా ఉండలేకపోతున్నారు. వాళ్ల మానప్రాణాలకు ఎక్కడా కూడా గ్యారంటీ లేకుండా పోతుంది. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు మంచి చెడులుచూడాల్సిన ఓ అన్న తన సొంత సోదరిపై లైంగిక దాడికి కి పాల్పడ్డాడు. శారీరకంగా లోబర్చుకొని చిత్రహింసలకు గురి చేశాడు.

సొంత సోదరుడు పెట్టే బాధలు గురించి తెలిసి తల్లి కూడా ఏం మాట్లాడకుండా పోయింది. దీంతో పాపం బాధితురాలు రక్షణ కోసం పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. అయితే అక్కడ కూడా ఆమెకు అదే అనుభవం ఎదురయ్యింది. అక్కడ పెద్దమ్మ కొడుకు కూడా ఆమెకు అదే నరకం చూపించాడు. దీంతో గతిలేని పరిస్థితుల్లో చివరకు ఆ అభాగ్యురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ దారుణం వెలుగుచూసింది. మణుగూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగూడెంలోని సింగరేణిలో రెస్క్యూ విభాగంలో పని చేస్తున్నాడు. చిన్నప్పుడే నాన్న వదిలివెళ్లడంతో అమ్మ, చెల్లెలి (20)తో కలిసి ఉంటున్నాడు. చెల్లిపై కన్నేసి ఆమెను లోబర్చుకొని.. శారీరకంగా హింసిస్తున్నాడు. అన్న అఘాయిత్యాల గురించి తల్లికి చెప్పినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు, తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది.

అయితే అక్కడ కూడా ఆమె బాధలు తీరలేదు. పెద్దమ్మ కొడుకు కూడా నరకం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు.. కన్నతల్లికి, పెద్దమ్మ కుటుంబసభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. గత్యంతరం లేక స్నేహితులు, గతంలో తనకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. విషయాన్ని బయటపెడితే చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని బాధితురాలు వాపోతోంది. ఘటనపై బాధితురాలి సోదరుడు, ఆమెతల్లి, పెద్దమ్మ, ఆమె భర్త, కుమారుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Untitled Document
Advertisements