పొలం పనులకు వెళ్తున్న రైతుకి హెల్మెట్ లేదని ఫైన్ వేసిన అధికారులు

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 12:49 PM

పొలం పనులకు వెళ్తున్న రైతుకి హెల్మెట్ లేదని ఫైన్ వేసిన అధికారులు

ట్రాఫిక్ పోలీసులు రూల్స్‌ను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. హెల్మెట్ లేకున్నా, సిటు బెల్ట్ బెట్టుకోకపోయినా, సెల్ ఫోన్ డ్రైవింగ్, లైసెన్స్ లేకున్నా ఇలా ఏ నిబంధనను అతిక్రమించిన వెంటనే జరిమానా వేసి చలాన్లు సెల్ ఫోన్ నెంబర్లకు పంపేస్తున్నారు. అయితే పొలం పనులకు వెళ్తున్న ఓ రైతును కూడా ట్రాఫిక్ పోలీసులు వదల్లేదు. హెల్మెట్ పెట్టుకోలేదంటూ అతడికి ఫైన్ వేసి షాక్ ఇచ్చారు. బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ అనేది తప్పనిసరి. అయితే ఏదైనా ప్రయాణం చేసినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం ధర్మారం గ్రామంలో ఓ రైతు తన పొలం పనులకు వెళ్లి వస్తుండగా నెత్తికి హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఫైన్ వేశారు. దీంతో ఆ రైతు అవాక్కయ్యాడు . ధర్మారం గ్రామానికి చెందిన పొన్నం మల్లశేం తువ్వాల, లుంగీ కట్టుకోని తన స్కూటీపై రోజు లాగే పొలం పనులకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో తాను హెల్మెట్ ధరించలేదని పోలీసులు రూ.200 వందలు ఫైన్ వేయడంతో పాటు యూజర్ ఛార్జ్ రూ.35 వేయడంతో మల్లేశం అవాక్కయ్యాడు. పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించడంతో షాక్ తిన్నాడు. అయితే తన ఒక్కడి విషయంలోనే కాకుడా అన్ని ట్రాఫిక్ రూల్స్‌లోనే అందరి విషయంలో కూడా పోలీసులు ఇలాగే విధులు నిర్వహించాలని మల్లేశం కోరుతున్నాడు.





Untitled Document
Advertisements