డబుల్ డోస్ కామెడీ స్టొరీ రెడీ చేసుకున్న అనుదీప్

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 03:11 PM

డబుల్ డోస్ కామెడీ స్టొరీ రెడీ చేసుకున్న అనుదీప్

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. విడుదలకు ముందే సినిమాకి విపరీతమైన హైప్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సులు కొల్లగొట్టాడు దర్శకుడు కేవీ అనుదీప్. ఈ సినిమా తర్వాత హీరో కంటే అనుదీప్‌కే విపరీతమైన క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా పాల్గొన్న ప్రతీ ఇంటర్వ్యూలో తనదైన స్టైల్‌లో పంచులు వేస్తు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచాడు. ఈ నేపథ్యంలో ‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏఏంటా అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. తన నెక్ట్స్ సినిమా కూడా తనకు కలిసొచ్చిన కామెడీ జోనర్‌లోనే తీస్తాడా.. లేక మరేదైనా స్టైల్‌లో తెరకెక్కిస్తాడా.. అనే చర్చ అప్పడే ప్రారంభమైంది. అయితే, అనుదీప్ తన తదుపరి చిత్రం కూడా కామెడీ జోనర్‌లోనే రాసుకుంటున్నాడని.. ఈ సినిమా కూడా ‘జాతిరత్నాలు’ స్టైల్‌లోనే ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. అంతేకాక.. ‘జాతిరత్నాలు’ కంటే ఈ సినిమాలో కామెడీ రెట్టింపుగా ఉండనుందట. ఇక ఈ సినిమాలో హీరోగా రామ్‌ని అనుకుంటున్నారట.

‘జాతిరత్నాలు’తో తమకు భారీ విజయం అందించి.. కలెక్షన్ల వర్షం కురిపించిన అనుదీప్‌తో వైజయంతి మూవీస్ సంస్థ మరో సినిమాని కూడా తీస్తామని హామీ ఇచ్చిందట. దీంతో అనుదీప్ తీసే ఈ సెక్ట్స్ ప్రాజెక్ట్ ఆ బ్యానర్‌లోనే అని అంటున్నారు. జాతిరత్నాలు సినిమాలో జోగిపేట అనే ప్రాంతం నుంచి అనూహ్యంగా మర్డర్ కేసులో చిక్కుకుంటారు హీరో అతని మిత్రులు. ఇప్పుడు తన తర్వాతి కథని కూడా ఇదే స్టైల్‌లో రాసుకుంటున్నాడట.. అనుదీప్. అయితే ఇందులో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే క్రమంలో పడే ఇబ్బందులను చూపించనున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి.. అధికారిక ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది.

Untitled Document
Advertisements