స్కూల్లో విద్యార్థులు అరాచకం...రేప్ చేయాలనిపించే అమ్మాయిలు వీరేనంటూ చాటింగ్

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 03:19 PM

స్కూల్లో విద్యార్థులు అరాచకం...రేప్ చేయాలనిపించే అమ్మాయిలు వీరేనంటూ చాటింగ్

విద్యాబుద్ధులు నేర్చుకోవలసిన వయస్సులో ఆ విద్యార్థులు హద్దులు దాటుతున్నారు. తోటి విద్యార్థులను తప్పుడు భావంతో చూస్తూ.. కిరాతకులుగా మారుతున్నారు. ‘‘మన క్లాస్‌మేట్స్‌లో ఎవరిని చూస్తే మీకు రేప్ చేయాలనిపిస్తోందో చెప్పండి అంటూ వారు.. ఏకంగా పోల్ నిర్వహించి మరీ అమ్మాయిల జాబితా తయారు చేశారు. వాట్సాప్ తదితర సోషల్ మీడియా యాప్స్‌లో రహస్యంగా గ్రూప్ ఏర్పాటు చేసుకుని మరీ దీని గురించి చర్చించారు. మన క్లాసులో రేప్ చేయాలనిపించే అమ్మాయిలు వీరేనంటూ రేటింగులు కూడా పెట్టారు. వీరి పాడుపనుల గురించి టీచర్లకు లీక్ కావడంతో స్కూల్ మొత్తం అప్రమత్తమైంది. వెంటనే ఆ విద్యార్థులను అదుపులోకి తీసుకుని చర్యలు మొదలుపెట్టారు.

ఈ ఘటన ఆస్ట్రేలియాలోని లాన్సెస్టన్ చర్చ్ గ్రామర్ స్కూల్లో చోటుచేసుకుంది. ఈ గ్రూప్ చాట్‌లో సుమారు 20 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారిలో ఇద్దరు 12వ తరగతి విద్యార్థులు ‘మోస్ట్ రేపబుల్ గర్ల్స్’ (Most Rapeable Girls) జాబితాను తయారు చేశారు. ఆ గ్రూపులో ఉన్న కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని టీచర్లకు స్క్రీన్ షాట్ల ద్వారా ఫిర్యాదు చేశారు.

ఈ సమాచారం తెలియగానే ఆ ఇద్దరు విద్యార్థులను గుర్తించి, వెంటనే స్కూల్ నుంచి సస్పెండ్ చేశామని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడతామని ప్రకటించారు. ఈ వార్త దావనంలా వ్యాపించింది. దీంతో ఆ సోషల్ మీడియా గ్రూపుల్లో ఉన్న మిగతా విద్యార్థులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


చదువుకోవలసిన వయస్సులో ఇలాంటి ఆలోచనలు రావడం చాలా దారుణమని, తమతో పాటు చదువుతున్న అమ్మాయిలపై గౌరవం లేకుండా అలాంటి కోరికలు వ్యక్తం చేయడం క్షమించరాని నేరమని అంటున్నారు. అయితే, విద్యార్థులు ఆన్‌లైన్ మాత్రమే దీనిపై చర్చించారని, నేరుగా ఏ విద్యార్థినితోనూ అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడటం చేయలేదని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. స్కూల్లోని విద్యార్థులందరికీ దీనిపై ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

అయితే, ప్రజలు మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఇద్దరు విద్యార్థులను పూర్తిగా స్కూల్ నుంచి బయటకు పంపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ స్కూల్లో చదువుతున్న అమ్మాయిల తల్లిదండ్రులతోపాటు 12 వేల మంది సంతకాలతో కూడిన పిటీషన్ దాఖలు చేశారు. వీరిలో పూర్వ విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం. వీరంతా మళ్లీ ఆ విద్యార్థులను స్కూల్లో అడుగు పెట్టనివ్వద్దని కోరుతున్నారు.





Untitled Document
Advertisements