ఆర్‌బీఐ కీలక నిర్ణయం...సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 03:29 PM

ఆర్‌బీఐ కీలక నిర్ణయం...సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని ఎంపీసీ కమిటీ తాజా పాలసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సాధారణ ప్రజలపై నేరుగానే ప్రభావం పడనుంది.

ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 4 శాతం వద్దనే స్థిరంగా ఉంది. అలాగే రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద నిలకడగా కొనసాగుతోంది. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 10.5 శాతంగా నిర్దేశించుకుంది. కోవిడ్ 19 కేసుల పెరుగుదల అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్‌బీఐ యథాతథ రేట్ల నిర్ణయం కారణంగా ఇప్పుడు సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం వల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి ప్రస్తుత వడ్డీ రేట్లే లభిస్తాయి. ప్రస్తుత బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై, సేవింగ్స్ ఖాతాలపై తక్కువ వడ్డీ వస్తోందని చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఆర్‌బీఐ నిర్ణయం వల్ల రుణ గ్రహీతలకు బెనిఫిట్ కలునుంది. లోన్ తీసుకోవాలని భావించే వారికి మరి కొంత కాలం తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉండనున్నాయి. దీని వల్ల రుణ గ్రహీతలపై తక్కువ భారం పడుతుంది. ఆర్‌బీఐ నిర్ణయం వల్ల లోన్ పొందే వారికి బెనిఫిట్ కలుగనుంది.

Untitled Document
Advertisements