అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిదా.. చెడ్డదా..

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 03:31 PM

అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిదా.. చెడ్డదా..

నిజంగా అరటి పండ్ల నీ బెస్ట్ ఫుడ్ అని చెప్పాలి. ఇది ఎనర్జీ ని ఇట్టే బూస్ట్ చేస్తుంది. అయితే అసలు ఏ సమయంలో అరటి పండు తింటే మంచిది..?, ఎలాంటి అరటి పండు తింటే మంచిది అనేది ఈరోజు తెలుసుకుందాం..!
అన్ని కాలాల్లోనూ అరటి పండ్లు దొరుకుతూనే ఉంటాయి. సూపర్ ఫుడ్ అయిన ఈ అరటి పండ్లు గురించి చాలా విషయాలు ఈరోజు నిపుణుల మన తో షేర్ చేసుకున్నారు. అయితే నిపుణులు చెప్పిన అనేక విషయాలు ఈరోజు చూసేయండి..!

అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది నిజంగా ఎక్కువ కేలరీలను మనకి ఇస్తుంది. పైగా వెంటనే ఎంత నీరసంగా ఉన్నా ఇది శక్తిని ఇస్తుంది. అరటి పండు ఏ సమయం లో తింటే మంచిది..? మామూలుగా ఎప్పుడైనా అరటి పండుని తినొచ్చు. కానీ ఏ సమయంలో అరటి పండు తినడం వల్ల మరింత మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎటువంటి సమయంలో అరటిపండు తింటే మంచిది అనేది ఇప్పుడు వెంటనే చూసేద్దాం
ఇక దీని కోసం చూస్తే... అరటి పండ్లను వర్కౌట్ చేసే ముందు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా మీరు సాయంత్రం పూట స్నాక్స్ రూపం లో కూడా అరటి పండ్లను తీసుకోవచ్చు. అది కూడా చాలా మంచిదే. అలానే ఒకటి గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే..? ఎప్పుడు కూడా రాత్రి పూట మాత్రం అరటి పండ్లు తీసుకోకండి. అది మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వలన జలుబు కూడా వస్తుంది. కాబట్టి రాత్రి పూట అరటి పండు తినే అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.
అలానే ఏదైనా టిఫిన్ కానీ భోజనం కానీ తిన్న తర్వాత అరటి పండు అస్సలు తీసుకోవద్దు అని కూడా చెబుతున్నారు. అలాగే చాలా మంది పాలు తాగి అరటి పండు తీసుకుంటారు అలా కూడా తీసుకోవడం మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కనుక మీకు ఇటువంటి అలవాటు ఏమైనా ఉంటే మానుకోవడం మంచిది. ఏ సమయంలో అరటి పండు తింటే మంచిదని అంటున్నారు మీరు కూడా ఆ సమయం లో మాత్రమే తీసుకోండి లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
కాబట్టి ఏ సమయం లో తీసుకున్నారో ఆ సమయం లో తీసుకోండి. అలా చేయడమే మంచి పద్ధతి. పచ్చి అరటి పండు అయితే ఎప్పుడు ఎటువంటి అరటి పండు తీసుకోవడం మంచిది అనేది చూద్దాం...! అరటి పండు లో ముగ్గి పోయినది, పచ్చివి, బాగా ముగ్గి పోయినవి ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. అయితే ఏ అరటి పండు తినడం మంచిది అనేది మనం ఇప్పుడు చూద్దాం...! మొదటిగా పచ్చి అరటి పండు గురించి చూద్దాం.


పచ్చి అరటి కాయ:
మీరు ఏమైనా స్నాక్స్ కోసం వెతుకుతుంటే అది కూడా తక్కువ షుగర్ ఉన్న వాటిని తీసుకోవాలంటే తప్పకుండా పచ్చి అరటి పండ్లు తీసుకోండి. కేవలం షుగర్ తక్కువ ఉండడం మాత్రమే కాకుండా మంచి స్నాక్ గా కూడా ఇది పని చేస్తుంది. దీనిలో అధిక మోతాదు లో స్టార్చ్ ఉంటుంది. అలానే ఇది ప్రోబయోటిక్స్ కంపౌండ్స్ కూడా ఉంటాయి. కాబట్టి పచ్చి అరటి పండు ఈ విధాలుగా పని చేస్తుంది కాబట్టి మీరు దీని కోసం చూస్తుంటే తప్పకుండా దీనిని తీసుకోవడం మంచిది.
ముగ్గిపోయిన అరటి పండు:
ఇప్పటి వరకు పచ్చి అరటి పండు కోసం చూశారు కదా ఇప్పుడు ముగ్గి పోయిన అరటి పండు కోసం చూద్దాం. ఇది కాస్త తియ్యగా ఉంటుంది. కానీ వెంటనే తిరిగి పోతుంది. అలానే పండిన అరటి పండు లో యాంటీ-ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ విషయాలు గుర్తు పెట్టుకుని దీనిని తీసుకునేటప్పుడు జాగ్రత్త పాటించండి.
ముగ్గిన అరటి పండు మీద బ్రౌన్ కలర్ ప్యాచెస్:
ఇలా వున్నా అరటి పండ్లని ఎంచుకుని చాల మంది తింటూ వుంటారు. అలానే చాలా మంది ఇటువంటి అరటి పండు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు. అయితే ఇది చాలా తియ్యగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించాలి. అలాంటిది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా విపరీతంగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు తియ్యగా తినాలని అనుకుంటే అప్పుడు బాగా పండిన అరటి పండ్లు తీసుకోవడం మంచిది.
కాబట్టి ఈ అరటి పండును అలాంటి సమయం లో మాత్రమే తీసుకోండి. కనుక నిపుణులు చెప్పిన ఈ పద్ధతిని అనుసరించడం, చాలా ముఖ్యం కాబట్టి అలానే మీరు అనుసరించండి. చూసారా నిపుణులు ఎంత మంచి సమాచారం మనకు ఇచ్చారో. కాబట్టి ఏ సమయం లో ఎటువంటి అరటి పండు తీసుకోవాలి అనేది ఈ పాటికే మీకు అర్థమైంది కదా ..! అలానే మనం అరటి పండ్లు తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు గురించి కూడా చూసేద్దాం ..!

అరటి పండు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 100 గ్రాముల అరటి పండు లో జీరో శాతం కొవ్వు ఉంటుంది. అలానే విటమిన్ బి 6 పొటాషియమ్, ఫైబర్ ఇలా మంచి న్యూట్రియన్స్ తో ఇది ఉంటుంది. అరటి పండు లో పొటాషియం కూడా ఎక్కువ మోతాదు లో ఉంటుంది కదా..! ఇది ఎముకలకు, దంతాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
కిడ్నీల ఆరోగ్యానికి అరటి పండు నిజంగా చేసే మేలు అంతా ఇంతా కాదు. అలానే ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాలు తగ్గించడానికి కూడా అరటి పండు బాగా ఉపయోగ పడుతుంది. వీటిని కూడా తగ్గించడానికి అరటి పండ్లు బాగా ఉపయోగ పడుతుంది. కాన్సర్ తో కూడా అరటి పండు లో ఉండే ఫైబర్ పొటాషియం పోరాడుతాయి.
దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది. అలాగే కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను కూడా ఇది పోగొడుతుంది. మొటిమలు, మచ్చలను కూడా తగ్గించుకో వచ్చు. అరటి పండ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు, రక్తహీనత సమస్యలు కూడా దూరమవుతాయి. దీని లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. కనుక అరటి పండుని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి మనకి లభిస్తుంది.
కాన్సర్ నివారణ లో కూడా అరటి పండు బాగా ఉపయోగ పడుతుంది. అలానే అరటి పండ్లు తీసుకోవడం వల్ల మల బద్ధకం కూడా తగ్గి పోతుంది. డిప్రెషన్ ని కూడా అరటి పండు తగ్గిస్తుంది. గర్భిణీలు అరటి పండ్లు తీసుకోవడం చాలా మేలు
అల్సర్ తో బాధ పడే వారికి ఎలాంటి బాధ లేకుండా అరటి పండ్లు తినవచ్చు. అరటిపండు లో ఉండే మృదుత్వం వల్ల పేగులకు ఎలాంటి నష్టం కలిగించదు. పైగా అల్సర్ కారక యాసిడ్ లను ఉత్పత్తి చేయకుండా అరటి పండు నిరోధిస్తుంది. అలానే స్ట్రోక్, గుండె సమస్యలు నుంచి ఇది గట్టెక్కిస్తుంది కూడా. దీనిలో ఉండే ఐరన్ అనీమియా నుంచి రక్షిస్తుంది. అరటి పండు లో శరీరానికి అవసరమయ్యే మాంగనీస్ 13 శాతం ఉంటుంది.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వాలంటే ఇలా చేయండి..
అరటి పండ్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది దీనిలో ఉండే ఖనిజ లవణాలు, పోషకాలు జీర్ణ క్రియ సాఫీగా చేస్తాయి. అలానే బోలు ఎముకల వ్యాధి తో బాధ పడే వారు అరటి పండ్లు తీసుకోవడం వల్ల బలహీనత దూరమై ఉత్తేజితం కలుగుతుంది. పైల్స్ సమస్య ఉన్న వారికి సాంత్వన చేకూరుస్తుంది. పైల్స్ తో బాధ పడే వారు అరటి పండ్లు తీసుకోవడం వల్ల మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ఇది హైబీపీ కి చెక్ పెడుతుంది కూడా.

అరటి పండు ఆకలిగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది. అలాగే సహజంగా బరువు కోల్పోవాలంటే అరటి పండు తింటే మంచిది. అప్పుడు అన్నం తక్కువగా తినేలాగా అరటి పండు చేస్తుంది.

Untitled Document
Advertisements