తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 03:34 PM

తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన

మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. 40 డిగ్రీలు దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఇంటీరియర్ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్నాటక మీదుగా మరత్వడా వరకు ఉన్న ఉపరితల ద్రోణి నెలకొని ఉంది. ఇవాళ ఇంటీరియర్ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్ర మట్టం నుండి 0.9కి మీ వరకు ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ రోజు (7వ.తేదీ) మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్,కామారెడ్డి, సంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాలలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని.. రేపు, ఎల్లుండి (8,9వ తేదీలలో) పొడి వాతావరణము ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

అయితే ఇక ఇవాళ మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వర్షాలు పడతాయన్న సమాచారంతో తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements