వైరల్ అవుతున్న పేరడీ పాట ‘కుడి భుజం మీద టీకా’

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 05:23 PM

వైరల్ అవుతున్న పేరడీ పాట ‘కుడి భుజం మీద టీకా’

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గూనపర్తి గ్రామానికి చెందిన ముత్యాల రఘుపతి గవర్నమెంట్ స్కూల్ టీచర్. బడిపంతులుగా స్టూడెంట్స్కు పాఠాలు చెప్పే ఈయన పలు అంశాలపై జనంలో చైతన్యం కలిగించేందుకు కవితలు, పాటలు రాస్తారు. చిన్నప్పటి నుంచి పాటలు, సాహిత్యం పట్ల అభిమానం ఉన్న రఘుపతి ఇప్పటివరకు 200 కవితలు రాశారు. ఆయన రాసిన ‘ముత్యాల కైతికలు’ అనే పుస్తకం ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డు’ల్లో చోటు దక్కించుకుంది. కాగా.. ఈ మధ్యే కరోనా టీకా వేయించుకున్న రఘుపతికి ఒక ఐడియా వచ్చింది. జనాల్లో కరోనా టీకాపై ఉన్న అపోహలను తొలగించాలని అనుకున్నాడు. అలా ‘సారంగదరియా’ పాటను పేరడీ చేసి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆయన పోస్ట్ చేసిన వారంలోనే ఆ పాట నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పటికే చాలామంది దాన్ని పాటగా పాడి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

Untitled Document
Advertisements