ఢిల్లీ లో అదుపు తప్పుతున్న కరోనా…పెరుగుతున్న మరణాల సంఖ్య

     Written by : smtv Desk | Tue, Apr 13, 2021, 01:33 PM

కరోనా వైరస్ మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ లక్ష కి పైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే దేశ రాజధాని లో మాత్రం ఇంకా దారుణంగా ఉంది. ఢిల్లీ లో కరోనా వైరస్ ను కట్టడి చేయడం లో ప్రభుత్వం విఫలం అవుతున్నట్లు అక్కడి ప్రతి పక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఢిల్లీ లో ఒక్క రోజులోనే 10 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం అందరినీ ఆందోళన కి గురి చేస్తోంది. అయితే గతేడాది అత్యధికంగా 7,830 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 10 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఢిల్లీ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 7 లక్షల 36 వేలకు చేరింది.


మరో పక్క ఢిల్లీ లో కరోనా వైరస్ మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 48 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అక్కడ 24 గంటల్లో 11,491 కేసులు, 72 మరణాలు నమోదు కావడం పట్ల ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు అంటున్నారు.అయితే ఏప్రిల్ 12 నాటికి ఢిల్లీ లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 11,355 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఢిల్లీ లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కి ఈ ఏడాది కి దీని ప్రభావం రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements