ఎల్‌ఐసీ పాలసీదారులకు అలర్ట్...ఇలా చేస్తే మీ డబ్బులు రావు

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 06:31 PM

ఎల్‌ఐసీ పాలసీదారులకు అలర్ట్...ఇలా చేస్తే మీ డబ్బులు రావు

ఇన్సూరెన్స్ అంటేనే చాలా మందికి ఎల్‌ఐసీ పేరు గుర్తుకు వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ ఇది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. టర్మ్ ప్లాన్స్ దగ్గరి నుంచి చిల్డ్రన్స్ ప్లాన్స్ వరకు చాలా పాలసీలు ఉన్నాయి.

చాలా మంది చాలా పాలసీలు తీసుకొని ఉంటారు. అయితే ఇలా పాలసీ తీసుకున్న వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మోసగాళ్లు చాలా మార్గాల్లో కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. అందువల్ల పాలసీ దారులు జాగ్రత్తగా ఉండాలి.


కొంత మంది మోసగాళ్లు ఎల్‌ఐజీ ఏజెంట్లు లేదంటే ఎల్‌ఐసీ అధికారులమని చెప్పి పాలసీదారులకు కాల్ చేస్తుంటారు. ఇలా కాల్ చేసి కొత్త పాలసీ వచ్చిందని చెప్తారు. దీన్ని తీసుకుంటే చాలా బెనిఫిట్స్ లభిస్తాయని ఆశ చూపుతారు. ఇలా చెప్పి ప్రస్తుతం ఉన్న పాలసీని వెనక్కి ఇవ్వాలని చెబుతారు.

వీరి మాటలు నమ్మని వారు పాలసీ వెనక్కి ఇస్తే నష్టపోవాల్సి రావొచ్చు. అలాగే మోసగాళ్లు చెప్పిన చోటు డబ్బులు పెడితే.. మళ్లీ నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల మీకు కూడా ఇలాంటి కాల్స్ వస్తే మాత్రం నమ్మవద్దు. కంపెనీ పాలసీదారులకు కాల్ చేసి పాలసీ వెనక్కి ఇవ్వాలని ఎప్పటికీ కోరదని ఎల్‌ఐసీ స్పష్టతనిచ్చింది.





Untitled Document
Advertisements