సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న 'అఖండ' టైటిల్ రోర్

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 06:39 PM

సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న 'అఖండ' టైటిల్ రోర్

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ కాంబో సృష్టించిన సంచలనాలు అలాంటివి. సింహా, లెజెండ్ సినిమాలతో మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగుంచిన ఈ జోడీ ఇప్పుడు 'అఖండ' అంటూ బరిలోకి దిగబోతోంది. బాలయ్య- బోయపాటి కాంబోలో రుదిద్దుకుంటున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూనే భారీ హైప్ క్రియేట్ చేసుకుంటోంది. ఈ మూవీ టైటిల్ విషయమై ఎన్నో పేర్లు ప్రచారంలోకి రాగా అందరి ఊహాగానాలను అధిగమించి 'అఖండ' అని ప్రకటిస్తూ టైటిల్ రోర్ వదిలారు బోయపాటి.

హర హర మహాదేవ శంభోశంకర అంటూ శివ నామ స్మరణతో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఇక ఈ వీడియోలో 'కాలుదువ్వే నంది ముందు రంగు మార్చే పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది' అంటూ తనదైన స్టైల్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్ మాస్ ఆడియన్స్‌కి అనుకున్న దాన్ని మించి కిక్కిచ్చింది. అందుకు తగ్గట్టుగా థమన్ బ్యాక్ గ్రౌడ్ స్కోర్ అదరగొట్టేయడంతో ఈ టైటిల్ రోర్ వీడియో వైరల్ అయింది.

ప్రస్తుతం యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ సత్తా చాటుతోంది. బాలయ్య గెటప్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ఇప్పటికే ఈ వీడియోకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంటే.. ఈ మూవీ రిలీజ్ డేట్ ముందే ప్రకటించి టైటిల్ విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూ టైటిల్ రోర్ విడుదల చేసిన బోయపాటి స్కెచ్ బాగానే వర్కవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ పోషిస్తుండటం విశేషం. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు బలమైన పాత్రల్లో ఆయన కనిపించనున్నారు. చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మే 28న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.








Untitled Document
Advertisements