రంజాన్ వేళ ప్రార్థనలకు నో పెర్మిషణ్....హైకోర్టు కీలక తీర్పు

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 08:18 PM

రంజాన్ వేళ ప్రార్థనలకు నో పెర్మిషణ్....హైకోర్టు కీలక తీర్పు

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో రోజుకి 60 వేలకి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రిలో బెడ్లు దొరక్క రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అత్యవసర చికిత్సకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ లభ్యత కూడా తక్కువైంది. ఇలాంటి నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలకు సంబంధించి బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మసీదులో సామూహిక ప్రార్థనలకు న్యాయస్థానం అనుమతులు నిరాకరించింది.

రంజాన్ మాసంలో దక్షిణ ముంబైలోని మసీదు వద్ద సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలంటూ జుమా మసీదు ట్రస్టు హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. మసీదు సుమారు ఎకరంలో ఉందని.. సామూహిక ప్రార్థనలకు 7 వేల మంది హాజరవుతారని ట్రస్టు నిర్వాహకులు కోర్టుకు తెలియజేశారు. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉండడంతో 50 మందిని మాత్రమే అనుమతిస్తారు. అందులోనూ కరోనా కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సామూహిక ప్రార్థనలకు అనుమతించలేమని బాంబే హైకోర్టు తెలిపింది. పౌరుల భద్రత ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది.





Untitled Document
Advertisements