మళ్ళీ పైకి దూసుకెళ్లిన బంగారం ధరలు

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 11:58 AM

మళ్ళీ పైకి దూసుకెళ్లిన బంగారం ధరలు

పసిడి ప్రేమికులకు ఝలక్. బంగారం ధర దూసుకెళ్లింది. పైపైకి చేరింది. పరుగులు పెట్టింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యా్డ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం బంగారం ధర పెరిగితే.. వెండి రేటు మాత్రం అక్కడే స్థిరంగా కొనసాగింది. మరోవైపు గ్లోబల్ మార్కె్ట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరుగుదలతో రూ.47,780కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 పెరుగుదలతో రూ.43,800కు ఎగసింది.

బంగారం ధర పెరిగితే.. వెండి రేటు మాత్రం అక్కడే స్థిరంగా ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.71,900 వద్దనే ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1738 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 0.24 శాతం పెరుగుదలతో 25.58 డాలర్లకు ఎగసింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.





Untitled Document
Advertisements