మన ఆహారం... మన ఆయుర్వేద వైద్యం

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 12:37 PM

మన ఆహారం... మన ఆయుర్వేద వైద్యం

శరీరంలో ఉన్న వ్యాధిని సమూలంగా నిర్ములించి, ఆ వ్యాధికి వాడిన ఔషధాల వల్ల వేరొక కొత్త వ్యాధి పుట్టకుండా ఆరోగ్యాన్ని కాపాడగలిగేదే అసలిన వైద్యం. అటువంటి వైద్యం ఈనాడు ప్రపంచంలో ఎక్కడా అమలులో లేదు. అసలు అలాంటి వైద్యం ఒకటుందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఆ విషయంలో కొందరికి తెల్సినా, వ్యాధి తగ్గే వరకూ పూర్తిగా ఔషదాలు, పథ్యాలు, ఆహార నియమాలు పాటించే ఓపిక వారిలో లేదు. అందుకే ఈనాడు మానవ శరీరాలన్నీ రోగాలతో కుళ్ళిపోతున్నాయి. ఎన్ని లక్షలు ఖర్చుపెట్టినా ఆరోగ్యం పొందలేక అల్లాడిపోతున్నారు. దీనికి పరిష్కారం? ఆయుర్వేదం అని కచ్చితంగా చెప్పొచ్చు.
ఔషదాలు ఎక్కువగా వాడకుండా కేవలం మన ఆహార విషయాల్లో కొంత మార్పు చేర్పులు చేసుకుంటే ఆరోగ్యాన్ని పొందే అవకాశాన్ని ఆయుర్వేధం ఒక్కటే కల్పిస్తుంది. ఎక్కువ ఖర్చు కష్టము, శరీరానికి హాని లేకుండా, చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేదాన్ని అందరు ఆచరిస్తే ఆనందంగా జీవించవచ్చు.
ఈనాడు యావత్ ప్రపంచాన్ని పీడిస్తున్న వ్యాడులన్నింటికి తగిన పరిష్కారం మన భారతీయ వంట ఇళ్ళలో ఉన్న పోపు దినుసుల్లోనూ, మన ఇళ్ళ చుట్టూ పక్కల పెరిగే మొక్కల్లోనూ దాగుంది మన ఆరోగ్యమంతా. అందుబాటులో ఉన్న వస్తువుల మీద చిన్న చూపు, చవకగా తయారయ్యే ఔషదాలమీద అజ్ఞానం. షాపుల్లో తళుకు బెళుకులతో ప్యాకింగ్ ిన ఔషధాలు ఈనాటి మానవుల పాలిత శాపాలుగా, సుఖ జీవనానికి అడ్డు గోడలుగా మారాయి.
ఆధునిక వైద్య విధానంతో ఏ ఒక్క వ్యాదీ సమూలంగా నయం కాకపోగా ఆ మందుల విష ప్రభావంతో కొత్త వ్యాధులు కల్గుతు, మానవల జీవితం ప్రశార్దాకంగా మారి, మనల్ని మృత్యువు వైపు నడిపిస్తుండడంతో యావత్ ప్రపంచం భయాందోళనలకు గురవుతున్నాయి. అపాయంలేని అతి చౌక వైద్య పద్దతుల కోసం ప్రజలు ఇప్పుడు అన్వేషిస్తున్నారు.
ఏ దేశ ప్రజలకు ఆ దేశాలోని ఆయా ప్రాంతాలలోని ఆహార విధానాలే అసలిన ఆరోగ్య ప్రదానాలు అనే నిజాన్ని తెలుసుకునే రోజు అతి సమీపంలో ఉంది. ఇన్నివైద్యశాలలు, ఇంతమంది వైద్యులు, ఇన్నిరకాల మందుల కంపెనీలు లేని ప్రాచీన కాలంలో ఆనాటి మానవులు కేవలం తమ ఆహార విధానాలను సక్రమంగా ఆచరించటం ద్వారా, తమ ఆరోగ్యాలను అపురూపంగా, కాపాడుకొని నిండు నూరేళ్ళ జీవించిన వాస్తవ కథనాలు నేటి నాగరికుల మెదళ్ళలో ఇప్పుడిప్పుడే కదలాడుతున్నాయి.
చక్కటి ఆరోగ్యాన్ని కాంక్షించే వారంతా వెంటనే వంట ఇంటిని గురించి తెలుసుకోవటం ఆరంభించాలి. మన వంటింట్లో ఒక్కో దినుసు, ఒక్కో ఔషదం అన్న నిజాన్ని ఇప్పుడైనా గుర్తుంచుకోవాలి. కాల, ఋతు స్వభావాలను బట్టి ఆహారాన్ని స్వీకరించే పద్దతులను రుపొందించుకుంటే ఏ అనారోగ్యము దరిచేరకుండా దర్జాగా బ్రతికేయవచ్చు. ప్రయత్నమే ఫలితానికి పునాది. ఫలితమే శాస్త్రానికి అనాది. అందుకే రాబోయే రోజుల్లో వంటశాలే వైద్యశాల. ఇది అక్షర సత్యం.





Untitled Document
Advertisements