ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చేతికి నెలకు రూ.50 వేలు

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 01:29 PM

ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చేతికి నెలకు రూ.50 వేలు

రిటైర్మెంట్ తర్వాత కష్టపడకుండా ఉండాలనుకుంటున్నారా? ప్రతి నెలా ఆదాయం పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. మీ రిటైర్మెంట్ డబ్బులను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి. తద్వారా మీరు ప్రతి నెలా ఆదాయం పొందొచ్చు. అయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఉదాహరణకు మీకు కోటి రూపాయల రిటైర్మెంట్ ఫండ్ వచ్చింది. మీరు ఈ డబ్బుతో ప్రతి నెలా రూ.50 వేలు సంపాదించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు రూ.15 లక్షలను సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌ SCSSలో పెట్టాలి.

అలాగే మరో రూ.15 లక్షలను ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా రూ.60 లక్షలను సెక్యూర్డ్ నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు NCDs, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో FD పెట్టాలి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి.

ఎన్‌సీడీల్లో డబ్బులు పెడితే ఎస్‌సీఎస్ఎస్, పీఎంవీవీవై, బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. అయితే మీరు ఇన్వెస్ట్ చేసే ఎన్‌సీడీ ఇష్యూయర్‌‌ కంపెనీని నిశితంగా గమనించాలి. లాకిన్ పీరియడ్, విశ్వసనీయత వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

మీరు వీటి నెలకు రూ.50 వేలు పొందొచ్చు. అయితే ఈ విధంగా అర్జించే వడ్డీ ఆదాయంపై పన్ను పడుతుంది. మీ ట్యాక్స్ స్లాబ్‌కు అనుగుణంగా పన్ను పడుతుంది. ఇకపోతే మిగిలిన రూ.10 లక్షలను లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం 5 ఏళ్లు కొనసాగించాలి. వీటిల్లో రిస్క్ ఉంటుందని గమనించాలి.





Untitled Document
Advertisements