"నా కన్న కూతురిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వండి"...కోర్టుకు లేఖ

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 01:47 PM


ఆ బిడ్డను కన్న వ్యక్తే ఈ లేఖను కోర్టుకు సమర్పించడం చర్చనీయమైంది. వయస్సుకు వచ్చిన తన బిడ్డను పెళ్లి చేసుకుంటానంటూ అందులో పేర్కొనడం న్యాయమూర్తులను సైతం ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం, లైంగిక సంబంధం పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. ఈ నేపథ్యంలో కోర్టుకు వచ్చిన ఈ లేఖను చూసి అంతా నోరెళ్లబెడతున్నారు. అసలు కన్న బిడ్డను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందని మండిపడుతున్నారు.

ఈ అరుదైన ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. మాన్హాటన్ ఫెడరల్ కోర్ట్‌లో ఈ లేఖ విచారణకు వచ్చింది. అయితే, ఈ లేఖ రాసిన వ్యక్తి తాను ఆ బిడ్డకు తల్లా? తండ్రా అనేది తెలియజేయలేదు. అలాగే తమ బిడ్డ జెండర్ కూడా ప్రస్తావించలేదు. అయితే, ఇది సమాజంలో నైతికంగా, సామాజికంగా, జీవశాస్త్రపరంగా అసహ్యకరమైన చర్య అని, దీన్ని ఆమోదిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు అందించినట్లేనని పలువురు కోర్టులో వ్యతిరేకత వ్యక్తం చేశారు.

‘‘ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సంబంధం కలిగివున్నా.. వివాహమనే శాస్వత బంధంతో మరింత సాన్నిహిత్యంగా, ఆధ్యాత్మికంగా గడపవచ్చు’’ అని ఆ పిటీషన్‌లో ఉంది. అయితే, ఆ పిటీషన్‌లో కనీసం వారు నివసిస్తున్న ప్రాంతం పేరును కూడా రాయలేదు. వారి మధ్య ప్రస్తుతం ఎలాంటి బంధం ఉందనేది కూడా స్పష్టత ఇవ్వలేదు. వారు లైంగిక జీవితం కోసం వివాహం చేసుకోనున్నారా? లేదా మరేదైనా కారణం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. తాము పెళ్లి చేసుకుందామని భావిస్తున్న పిల్లలు పెద్దవాళ్లేనని లేఖ పేర్కొన్నారు.

అయితే, ఇలాంటి సంబంధాలను న్యూయార్క్ చట్టాలు థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణిస్తున్నాయి. ఈ నేరం కింద సుమారు నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధిస్తారు. అయితే, పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి.. తాను తమ బిడ్డకు ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకునానని, ప్రస్తుత చట్టాలు దీన్ని మానసిక హాని కలిగించే చర్యగా భావిస్తున్నాయని పిటిషనర్ పేర్కోవడం గమనార్హం. ఇలాంటి చట్టాలను రాజ్యంగ విరుద్ధమని ప్రకటించాలని డిమాండ్ చేయడం కొసమెరుపు. ప్రపంచంలో ఇలాంటి తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఉంటారా??





Untitled Document
Advertisements