గోధుమ గడ్డి రసంతో ఆరోగ్యం !

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 02:37 PM

గోధుమ గడ్డి రసంతో ఆరోగ్యం !

గోధుమ గడ్డి రసం మన ఆరోగ్యానికి ప్రయోజనకరం. అన్ని వ్యాధులను అధిగమించే శక్తి దానిలో ఉండటంతో ఆయుర్వేదవావుధ్య్లు దాన్ని అమృతంగా పిలుస్తారు. శాస్త్రవేత్తలు దీన్ని ఆకుపచ్చటి రక్తంగా పిలుస్తారు. రక్తాన్ని శుద్ధి చేసే సామర్ధ్యం గోధుమ గడ్డి రసానికి ఉంది. హిమోగ్లోబిన్ పెంచి, శరీరం నుండి విష పదార్దాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
వ్యాధులకు మందులు వాడినా, వ్యాధి తగ్గి ఆ మందు దుష్ప్రభావానికి మళ్ళీ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాధి రహితంగా ఉండటానికి సహజమైనా విధానాలు మాత్రమే మనం పాటించాలి. సహజమైన చికిత్స శరీరాన్ని ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా ఉంచుతుంది. అటువంటిదే గోధుమ గడ్డి రసం, సహజమైన చికిత్సే అది ప్రకృతి వరం. ఏ వయసువారైనా గోధుమ గడ్డి రసాన్ని ఉపయోగించవచ్చు. ప్రతిరోజు గోధుమ గడ్డి రసాన్ని ఒక పరిమితిగా తీసుకోవడం వల్ల అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వ్యాధితో పోరాడే సామర్థ్యాన్ని మేరుగుపరుచుకుంటాడు. `గోధుమ గడ్డి రసంలో పోషక విలువలు చాల ఉన్నాయి. దాన్ని క్రమబద్దంగా వినియోగించటం ద్వారా శరీరం బలంగానూ, శక్తివంతంగానూ తయారవుతుంది. గోధుమ గడ్డిలో అత్యధికంగా క్లోరోపిల్ ఉంది. ఇది మానవ రక్తంలో 40 శాతం వరకు సరిపోతుంది. పాలు, పెరుగు, మాంసం కంటే కూడా గోధుమ గడ్డి రసంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజు ఔషదంగా తీసుకోవాలంటే గోధుమ గడ్డిని మనమే ఇంట్లోని పెరట్లో పెంచుకుంటే చౌకగా, సులభంగా, తాజాగా గోధుమ గడ్డి రసం లభిస్తుంది. గోధుమ గడ్డి రసంలో విటమిన్లు, ఆల్కలైన్ లు సమృద్దిగా ఉన్నాయి.ఈ రసం కొద్దిగా తీసుకున్న అన్ని లోపాలానూ భర్తీ చేస్తుంది. అన్ని వయసుల వారు ఈ గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవచ్చును. పుట్టిన శిశువులకు కూడా ఇవ్వొచ్చునని చెపుతున్నారు నిపుణులు. చురుకైన ఎంజైములు, మినరల్స్, పీచు, విటమిన్లు సహజంగా ఉండి జీవ సంరక్షిగా పేరుగాంచింది.
ఓ పది పూలకుండీలు మట్టి, ఆవుపేడ ఎరువు కలిపి ఉంచండి. నాటే గోధుమను రాత్రివేళ నీటిలో నానవేసి, కుండలోని మట్టికి 1/2 అంగుళం కంటే కిందకు 10 గ్రాముల గోధుమలు నానవేయండి.నీరు తీసి కుండను నీడలో పెట్టి సూర్యకాంతి నేరుగా పడకుండా జాగ్రత్తపడండి. రెండోరోజు కుండలో గోధుమను నాటండ. ఈ విదంగా 9 రోజులు వరుసగా 9 కుండల్లో గోధుమను నాటండి. రోజుక్కోక్కసారి నీరు పోయండి. మొక్క పెరిగేకొద్దీ నీరు పోయడం తగ్గించండి.
మొదటిరోజు పెరిగిన గోధుమ మొక్క నుండి ఇప్పుడు గోధుమ గడ్డిని కోయండి.గోధుమ గడ్డి 9 రోజుల్లో 7-8 అంగుళాలు పెరుగుతుంది. వేర్లతో సహా పూర్తిగా మొక్కని లాగండి. ఇప్పుడు గోధుమ గడ్డిని బాగా కడిగి మిక్సిలో వేసి రుబ్బి రసం తీసి 50 మీ.లీ. తీసుకోండి. ఇలా ఒక కుండ అయిన తరువాత ఒక కుండాలో గడ్డి తీస్తూ, అందులో మల్లి గోధుమ గడ్డి నాటుకుంటూ పోతుంటే ఇప్పుడు మీకు అన్ని వేళలా గోదుమగడ్డి అందుబాటులో ఉంటుంది. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం తాయారు చేసుకుంటే వెతుక్కునే పని లేదు.
సరైన సమయంలో 7-8 అంగుళాల ఎత్తు పెరిగినప్పుడు మాత్రమే గోధుమ గడ్డిని కోయాలి. గోధుమ గడ్డి రసం తయారు చేసేటప్పుడు ప్లాస్టిక్ పాత్రలు ఉపయోగించరాదు. ఈ రసం తాగే అరగంట ముందు, వెనుక ఏమీ తీసుకోరాదు. తీసుకుంటే వాంతులు అవుతాయి. జలుబు చేస్తుంది.
* గోధుమ గడ్డి రసం, అల్లం, తేనే, తమలపాకు రసం కలిపి తీసుకుంటే రుచిగా ఉంటుంది.
* నిమ్మరసం, ఉప్పు గోధుమ గడ్డి రసం లో కలపకూడదు.
* గోధుమ గడ్డిని నమిలినా పళ్ళు, చిగుళ్ళు బలంగా ఉండి, నోటీ దుర్వాసనను తగ్గిస్తుంది.గాయాలు,కురుపులకు చక్కటి ఔషదం.
* శరీర వేడిని చల్లపరుస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఉదర సమస్యలు, మలబద్దకం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* రక్తహీనత, రక్తసంబంద వ్యాధులను నయం చేసీ, ఎముకలను బంగా ఉంచుతుంది. చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది.
* ఉబ్బసం, క్షయ, వ్యాధులకు మంచి మందు.
* ఖాళీ కడుపునా 1 కప్పు రసం తాగాలి. ఈ రసాన్ని క్రమబద్దంగా త్రాగితే క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో పోరాడడానికి కావలసిన వ్యాదినిరోదక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే సంజీవిని గోధుమ గడ్డి రసం. నీటి కాలుష్య వాతావరణంలో వచ్చే వ్యాధులకు సంజీవిని గోదుమగడ్డి రసం.





Untitled Document
Advertisements