గ్లెన్ మాక్స్‌వెల్ రివర్స్ స్వీప్...చూస్తుండిపోయిన ప్లైస్లిప్ ఫీల్డర్

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 02:49 PM

గ్లెన్ మాక్స్‌వెల్ రివర్స్ స్వీప్...చూస్తుండిపోయిన ప్లైస్లిప్ ఫీల్డర్

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిపించే ప్రదర్శన కనబర్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. చివరి బంతి వరకూ ఒంటరి పోరాటం చేసిన మాక్స్‌వెల్ (59: 41 బంతుల్లో 5x4, 3x6) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌కి కష్టమైన పిచ్‌పై తెలివిగా అతను పరుగులు రాబట్టిన తీరుకి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తుండగా.. యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ కొట్టిన రివర్స్ స్వీప్ షాట్‌ అందర్నీ ఆకట్టుకుంది.

ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన నటరాజన్ వరుస యార్కర్లు సంధిస్తూ కనిపించాడు. కానీ.. ఆ ఓవర్‌లో ఆఫ్ స్టంప్‌కి కొద్ది వెలుపలగా నటరాజన్ బంతిని విసరగా.. గ్లెన్ మాక్స్‌వెల్ రివర్స్ స్వీప్ షాట్‌తో బౌండరీ సాధించాడు. నటరాజన్ బంతి విసిరే వరకూ ఎదురుచూసిన మాక్స్‌వెల్ రెప్పపాటు పొజీషన్ మార్చుకుని థర్డ్ మ్యాన్ దిశగా బంతిని బౌండరీకి తరలించాడు. బంతి తన పక్కన పడి వెళ్తున్న ప్లై స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ నిస్సహాయ స్థితిలో అలానే చూస్తుండిపోయాడు. దాంతో.. హైదరాబాద్ డగౌట్‌ వద్ద నిల్చొని ఉన్న రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లలో ఒకరు బంతిని అందుకుని మైదానంలోకి విసిరారు.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన హైదరాబాద్ 143/9కే పరిమితమైంది. బెంగళూరు టీమ్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన మాక్స్‌వెల్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.





Untitled Document
Advertisements