"తెలంగాణ మహిళలు షర్మిలను సీఎం చేస్తారు"

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 02:59 PM


తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహించిన షర్మిల దీక్షకు దిగుతానని ప్రకటించారు. ఇవాళ ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగ దీక్షకు దిగారు. ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్న డిమాండ్‌తో ధర్నాచౌక్‌లో వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షకు రచయిత కంచె ఐలయ్య మద్దతు పలికారు. కాకతీయ గడ్డ మీద రుద్రమ దేవి తర్వాత మళ్లీ షర్మిలను చూస్తున్నానంటూ ఉద్వేగానికి గురయ్యారు.

తెలంగాణ గడ్డపై రాజకీయ పార్టీ పెట్టే హక్కు షర్మిలకు ఉందన్నారు. సమ్మక్క - సారక్క వారసురాలు షర్మిల అని, తెలంగాణ మహిళలు షర్మిలను ముఖ్యమంత్రి చేస్తారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ పాలనను గుర్తు చేసుకున్నారు. ఆయన హయాంలో ఆరు వేల ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ప్రారంభించారని, పేదల చదువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు కంచె ఐలయ్య. షర్మిల 72 గంట‌ల నిరాహార దీక్షకు దిగారు, అయితే పోలీసులు మాత్రం ఒకరోజు దీక్షకు మాత్రమే అనుమతి ఇచ్చారు.





Untitled Document
Advertisements