ఏ కాలంలో అయినా మాయిశ్చరైజర్స్ వాడకం తప్పనిసరి

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 04:24 PM

ఏ కాలంలో అయినా మాయిశ్చరైజర్స్ వాడకం తప్పనిసరి

అందంగా ఉడడం ఆరోగ్యానికి ప్రతీక. అందాన్ని పాడవకుండా చూసుకోవడం మన కర్తవ్యం. అందం అనేది భగవంతుడు ఇచ్చిన వరం ఆ అందాన్ని కాపాడుకోవడానికి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే అందం రెట్టింపు అవుతుంది. కొంచెం శ్రద్ధ, కాస్త ఓపిక ఉంటె చాలు. అనడంలో కూడా ఆనందం పొందగలరు. మీ భర్త, పిల్లలు, స్నేహితులు పొగడ్తలను పొందగలరు.
అయితే, ఇందుకు కావాల్సిందల్ల మేకప్ చేసుకొనే ముందు అన్ని విషయాలు తెలుసుకుని పాటిస్తే మీకేలాభం.. ఆ విషయాలేంటో చుసేయండి మరి.
* ఐ షాడో ఎంపికలో, రంగుల విషయంలో శ్రద్ధ తప్పకుండా తీసుకోవాలి. ముందుగా న్యూట్రల్ పోఎదర్ అప్లయ్ చేయాలి. తరువాతా క్రీమ్ అప్లై చేయాలి. చివరగా ఐషాడోను అప్లయ్ చేయాలి. అయితే పొద్దున్న పూట మేకప్ లో క్రీమ్ వాడకూడదు.
* మీరు ఐ పెన్సిల్ ను వాడుతుంటే క్రీమీ ఫార్ములా ఉన్న పెన్నిల్ ను మాత్రమె వాడాలి. ఇది మీ చర్మాన్ని బాధించాదు. ఐలైనర్ బ్రష్ వాడితే మంచిది. ఐలైనర్ బ్రష్ ను శుభ్రమైన వస్త్రం పై టాప్ చేసి వాడితే పర్ఫెక్ట్ గా వస్తుంది.
* అందమైన కనురెప్పలకు మస్కారా అప్లై చేస్తారు. మరి ఎక్కువగా రాసుకుంటే బాగుండదు. అలాగని తక్కువగా రాస్తే అందంగానూ ఉండదు. తగినంత మాత్రమే వాడాలి. కావలసినా వారు వెరైటీగా బ్రౌన్ కలర్ మస్కారా వాడొచ్చు. మీ వీలును బట్టి, ఇష్టాన్ని బట్టి ఇతర రంగులను కూడా వాడొచ్చు సరదాగా.
* ఒక చెంచాడు తెల్ల నువ్వులు, కొద్దిగా పసుపు కలిపి నూరి బ్లాక్హెడ్స్ ఉన్న చోట రాస్తే క్రమంగా అవి తగ్గిపోతాయి.
* మేకప్ లో మాయిశ్చరైజర్ వాడటం వలన మేకప్ ఎంతో అందంగా, సున్నితంగా, తేజోవంతంగా ఉంటుంది. అందుకే మేకప్ కు ముందుగా మాయిశ్చరైజర్ కలిగిన క్రీమ్ వాడటం మంచిది. చర్మం మెత్తగా ఉంటె మేకప్ బాగా పడుతుంది. చూడడానికి బాగుంటుంది.
* మేకప్ చేసుకోవడానికి ముందుగా పాలతో ముఖం కడిగి, తరువాత మెత్తటి వస్త్రంతో అద్ది స్కిన్ సీరం అప్లయ్ చేయాలి. తరువాత మాయిశ్చరైజర్ రాయాలి. ఎన్నో రకాల మాయిశ్చరైజర్స్ మనకి మార్కెట్ లో లభిస్తున్నాయి. ద్రావకంగా, లోషన్లుగా అయితే సీజన్ కి తగ్గట్టుగా ఇప్పుడు బజారులో అందుబాటులో ఉంటున్నాయి. అందులో మన శరీరానికి తగ్గట్టు మనం ఎన్నుకోవలసి ఉంటుంది.
* చలికాలంలో ఓ రకంగా, వేసవిలో మరో రకంగా మాయిశ్చరైజర్స్ వాడాల్సి ఉంటుంది. వేసవిలో ఐతే తేమ బాగా ఉన్న మాయిశ్చరైజర్స్ తీసుకోవాలి. పాలతో శుభ్రం చేసి, చక్కగా స్కిన్ ని మెత్తటి క్లోత్ తో అద్ది, సీరం రాసి తరువాత బ్రెష్ తో రుద్ది, టిష్యు పేపర్తో అద్ది మాయిశ్చరైజర్ రాయాల్సి ఉంటుంది.
* మేకప్ బాగా సెట్ అవ్వాలంటే ఫౌండేషన్ కోసం ఉపయోగించే రంగుపై కూడా ఆదారపడి ఉంటుంది. తర్వాత ట్రాన్స్ సెంట్ పౌడర్ కొంతవరకూ మీ ముఖకాన్తిని పెంచుతుంది. ప్రతిరోజు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు కనుబమ్మలు కోహిల్ పెన్సిల్ తో ఐబ్రోస్ దిద్దుకుని, లైట్ లిప్స్టిక్ వేసుకుని మాస్కారా వాడి, బ్రష్తో కంటి షాడోను లిప్స్తిక్కర్ను సరిద్దిద్దుకోండి.
* పార్టీ మేకప్ ఇది వేరుగా ఉంటుంది. దీనికి కొంత వరకూ కంటిరెప్పలకు గోల్డ్, సిల్వర్ మేకప్ మెటీరియల్స్ వాడడం వల్ల మీ అందం మరింత పెరుగుతుంది.
* ఏ వయసులో వారైనా సరే, కాస్త శ్రద్ధ, శ్రమ అనుకోకపోతే ప్రతి నిమిషం అన్ని కోణాల్లోనూ, అందరికి అందంగా కనిపించవచ్చు.
* కళ్ళకి అందాన్ని చలువని కలిగిస్తుంది కాటుక. మెరిసే కాంతి కళ్ళకిచ్చి, కన్ను విశాలంగా అయ్యేలా చేస్తుందని మన వాళ్ళ నమ్మకం కూడా, ఆరోగ్యం కూడా.
* మంచినీల్లకు మించిన దివ్య ఔషదం లేదనీ అందరికీ తెలిసినదే. రోజు 10 నుంచి 15 గ్లాసుల నీళ్ళు తాగుతుండాలి. దాహంగా అనిపించినప్పుడు మాత్రమె నీరు తాగకుండా, నీళ్ళు పక్కన పెట్టుకుని అప్పుడప్పుడు తాగుతుండాలి.
* కాళ్ళకు, చేతులకు వ్యాక్సింగ్ చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఎందులో వాడే గ్లిజరిన్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నిమ్మరసం యాంటీ సెప్టిక్ గా పని చేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ హెయిర్ రుత్స్లోకి పోయి, బలహీన పరిచి వెంట్రుకల పెరుగుదలను తగ్గిస్తుంది. వేడి వ్యాక్స్ ఉపయోగించడం వలన వెంట్రుకల కుదుళ్ళు ఉడి వస్తాయి.ఎదే మంచిది కూడా.





Untitled Document
Advertisements