సాక్షి మీడియాపై వైఎస్ ష‌ర్మిల కామెంట్స్

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 06:03 PM

సాక్షి మీడియాపై వైఎస్ ష‌ర్మిల కామెంట్స్

ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఆమె ఇక్కడ పార్టీ ఏర్పాటు చేస్తారన్న విషయం తెలిసిందే. దీంతో వైఎస్ అభిమానులతో ఆమె గత కొన్ని రోజులుగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో దీక్షకు దిగారు. అయితే దీక్ష సందర్భంగా వైఎస్ ష‌ర్మిల సాక్షి మీడియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

లైవ్ లో ఉండ‌గానే సాక్షి మీడియాపై షర్మిల కామెంట్స్ చేశారు. కవరేజ్ చేసింది చాల్లేమా... ఎలాగో సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా అంటూ షర్మిల సెటైర్ వేశారు. దీంతో ప‌క్క‌నే ఉన్న విజ‌య‌మ్మ షర్మిలను వారించారు. ఆమె పక్కనే ఉన్న తల్లి వైఎస్ విజయలక్ష్మి ఒక్కసారిగా బిత్తరపోయారు. వెంటనే తేరుకుని.. షర్మిలను మెల్లగా చేత్తో తట్టారు.షర్మిల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

మరోవైపు నిరుద్యోగులకు మద్దతుగా ఇందిరాపార్క్‌లో షర్మిల 72 గంటలపాటు దీక్షకు దిగారు. నోటిఫికేష‌న్లు లేక నిరుద్యోగులు బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడుతుంటే దున్నపోతు మీద వాన ప‌డిన‌ట్లు సీఎం కేసీఆర్ తీరు ఉంద‌ని వైఎస్ ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఉద్యోగ దీక్షలో ష‌ర్మిల మాట్లాడుతూ.. 40 ల‌క్షల మంది నిరుద్యోగులు నోటిఫికేష‌న్ కోసం ఎదురు చూస్తున్నార‌ని అన్నారు. కొంద‌రు యువ‌కులు ఉద్యోగాలు రావ‌ని నిరాశ‌తో ఆత్మహ‌త్యల‌కు పాల్పడుతున్నార‌ని ఆమె ఆవేద‌న వ్యక్తంచేశారు.





Untitled Document
Advertisements