ఉపవాసంతో ఆరోగ్యం... ఎలా అనుకుంటున్నారా? చూసేయండి మరి

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 12:06 PM

ఉపవాసంతో ఆరోగ్యం... ఎలా అనుకుంటున్నారా? చూసేయండి మరి

ఉపవాసం కేవలం శరీరంలోని అంతర అవయవాల్లో కాకుండా, కామ, క్రోధాలను, మద మాత్సర్యాలను అణచుటకు ఉపవాసము మిక్కిలి ఉపయోగపడును. దురభ్యాసాలను విడుచుటకు, భక్తి, బ్రహ్మచర్యానికి ఉపవాసం మిక్కిలి ఉపయోగపడుతుంది. సంతోషానికి, ఆనందానికీ, ఆరోగ్యానికీ కూడా ఉపవాసం మిక్కిలి ఉపయోగకారి.
ఉపవాసం చేయకూడని వారు, బలహీనంగా ఉన్న రోగులకు, గుండెజబ్బులున్న వారు, చిన్నపిల్లలు, వృద్దులు, గర్బిణీ స్త్రీలు, బాలింతలు, క్షయ మరియు రక్త క్షీణత రోగులు, మధుమేహం అధికంగా ఉన్నవారు, మనో నిబ్బరం లేని రోగులు ఒక రోజు ఉపవాసం చేయవచ్చును. లేదా ఫలోపావాసం చేయవచ్చును. అంటే పళ్ళు తిని ఉండవచ్చును.
ఉపవాసం చేయడగినవారు స్థూలకాయులు, ఉబ్బసం, సంథీ వాతం, రక్తపు పోటు, చర్మవ్యాధులు, దీర్గరోగులు వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయవచ్చును. స్థూలకాయులు వారి మానసిక స్థితిననుసరించి ఉపవాసం చేయవచ్చును. దీర్గోపావాసం చేసేవారు ఇంటివద్ద చేయకూడదు. చికిత్సాలయంలో డాక్టరు సమక్షంలో చేయాలి. తినుబండారాల గురించి ఆలోచించకూడదు. తినేవారి ముందు కూర్చోరాదు. ముఖ్యంగా వంటశాలకు, భోజనశాలకు దూరంగా ఉండాలి.
ఉపవాసము వల్ల వివిధ అవయవాల్లో కలిగే మార్పులు సంభవిస్తాయి. జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి, అజీర్ణాన్ని తొలగించి, ఆకలి వృద్ది చేస్తుంది. మలశాయంలోని మురికి అంత బయటకు వెళ్ళిపోతుంది. మూత్రపిండాల్లోని విష పదార్దాలు రాళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. ఊపిరితిత్తుల్లోని నీరు బయటకు వెళ్ళిపోయి ఆయాసాన్ని తగ్గిస్తుంది. శ్వాసక్రియ చక్కగా జరుగుతుంది. గుండె చుట్టూ లోపల చేరిన క్రొవ్వు, నీరు తగ్గి, గుండె చక్కగా కొట్టుకుంటుంది. అధికంగా తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువై గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి గుండె జబ్బు ఉన్నవారు కేవలం పళ్ళరసాలు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు.
ఆహారం పనిచేయటానికి, జీర్ణం అవ్వటానికి లివరు బాగా పనిచేయాలి. కాబట్టి ఉపవాసం వల్ల విశ్రాంతి లబిస్తుంది. వాటిలోని మలినాలు తొలగింపబడి జీర్ణక్రియను వృద్ది చేస్తుంది ఉపవాసం. ఉపవాసం రక్త దోషాలను నివారిస్తుంది. అలాగే రక్త ప్రసరణ చురుకుగా జరుగుతుంది. తమ్మిర్లు, మంటలు, నొప్పులను నివారిస్తుంది. కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసం, ఇతర మలినాలు తొలగిపోయి వ్యాధి నివారణ అవుతుంది. ఉపవాసం వలన నాది మండలము శోధింపబడి వ్యాధి నివారణ అవుతుంది. జ్ఞానేంద్రియాలలోని మాలిన్యాలను కూడా తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ వ్యాధులు తొలగిపోతాయి. శరీరానికి చక్కని రంగు వస్తుంది. మనస్సు నిర్మలమై కోప, తాపాలను నివారించి, ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడతాయి.
ఉపవాసం చేస్తాప్పుడు విపరీతమైన తలనొప్పి, అరుచి కలిగి, వాంతి వచ్చినట్లుగా అనిపిస్తుంది. నోరంతా అంటుకుపోయినట్టుగా, పాచి కంపుతో ఉంటుంది. కొందరికి పసరు పడుతుంది. ఎక్కిళ్ళు వస్తాయి. ఎటువంటి సందర్భాలలో చికిత్సాలయంలో ఉపవాసం చేస్తే మానసిక ధైర్యం కలుగుతుంది.
ఉపవాసం చేశాక త్వరగా విరమించడానికి తొందరపడకూడదు. నోటిలో లాలాజలం ఊరి, నోటికి రుచి కలుగుతుంది. ముందుగా పలహారం తీసుకోవాలి. తరువాత రొట్టె, కురగాయాలు, పళ్ళు తీసుకోవాలి. దోసె, క్యారెట్, బీట్రూట్, టమాట తినవచ్చు. మొలకెత్తిన పెసర, వేరుశెనగలు ఓ పిడికెడు తీసుకోవాలి. అన్నం కూరగాయలు, మజ్జిగ మధ్యాహన్నం తినాలి. సాయంత్రం పుల్కాలు, కూరలు మజ్జిగ తీసుకుంటే ఉపవాసం ముందు ఫలహారం తర్వాత పక్వాహారం తీసుకోవడం మర్చిపోకండి.
ఉపవాసం తర్వాత ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. కారం మసాలాలు, పచ్చళ్ళు, పండివంటలు తినకూడదు. తింటే విరేచనాలు అవుతాయి. గోధుమ, జొన్న జావకానీ మజ్జిగలో కలిపి త్రాగవచ్చును. అన్ని కూరగాయలు కల్గిన వంటను వండి తింటే మంచి ఆరోగ్యం సిద్దిస్తుంది.













Untitled Document
Advertisements