భార్యపై పేరుపై అకౌంట్ తెరిస్తే చేతికి రూ.40 లక్షలు!

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 12:57 PM

భార్యపై పేరుపై అకౌంట్ తెరిస్తే చేతికి రూ.40 లక్షలు!

తక్కువ డబ్బుతో మంచి రాబడి పొందాలని భావించే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF స్కీమ్ అనువుగా ఉంటుంది. ఉత్తమమైన దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పీపీఎఫ్ కూడా ఒకటి. పీపీఎఫ్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఇన్వెస్ట్ చేసిన డబ్బుల, వచ్చే వడ్డీ, తీసుకునే డబ్బులు ఇలా ప్రతి దారిపై పన్ను మినహాయింపు ఉంటుంది.

మీరు మీ భార్య పేరుపై కూడా పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. పూర్తి భద్రత లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో రూ.1.5 లక్షల వరకు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.

ప్రతి ఏడాది మీ వడ్డీ డబ్బుల మీ పీపీఎఫ్ ఖాతాకు జమవుతూ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తూ వస్తుంది. రేట్లను పెంచడం, తగ్గించడం లేదంటే స్థిరంగా కొనసాగించడం ఉంటుంది. అకౌంట్‌ క్లోజ్ కాకుండా ఉండాలంటే ఏడాదికి కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి.

మీరు మీ భార్యపై పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా తెరిచి ఏడాదికి రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తూ వస్తున్నారని అనుకుందాం. మీరు ఇలా 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే.. మీ చేతికి ఏకంగా రూ.40 లక్షలు వస్తాయి. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు అని గమనించాలి. ఈ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పెంచుకుంటూ వెళ్లొచ్చు.





Untitled Document
Advertisements