సింపుల్ రనౌట్‌ని చేజార్చిన పంత్....తెగ ఫీలైపోయిన బౌలర్

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 01:03 PM

సింపుల్ రనౌట్‌ని చేజార్చిన పంత్....తెగ ఫీలైపోయిన బౌలర్

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ప్రత్యక్షంగా కారణమయ్యాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగినని మ్యాచ్‌లో.. తొలుత తన హిట్టింగ్‌తో టీమ్‌ని మెరుగైన స్థితిలో నిలిపేలా కనిపించిన పంత్.. లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌటయ్యాడు. ఆ తర్వాత కీపింగ్‌లో సింపుల్ రనౌట్‌ని చేజార్చి ఢిల్లీకి పుంజుకునే అవకాశం కల్పించాడు. దాంతో.. నెటిజన్లు రిషబ్ పంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచిన రిషబ్ పంత్ (51: 32 బంతుల్లో 9x4) హాఫ్ సెంచరీ తర్వాత రియాన్ పరాగ్ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌటయ్యాడు. బంతి నేరుగా బౌలర్ చేతుల్లోకి వెళ్తున్నా.. పంత్ సాహసోపేతంగా పరుగెత్తాడు. దాంతో.. రియాన్ పరాగ్ విసిరిన డైరెక్ట్ త్రోకి అతను రనౌటయ్యాడు. పంత్ రనౌట్ తర్వాత మళ్లీ తడబడిన ఢిల్లీ తక్కువ స్కోరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అనంతరం రాజస్థాన్ టీమ్ ఛేదనలో 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో క్రిస్ మోరీస్ (36 నాటౌట్: 18 బంతుల్లో 4x6)కి సహకారం అందిస్తున్న.. జయదేవ్ ఉనద్కత్ (11 నాటౌట్: 7 బంతుల్లో 1x6)ని రనౌట్ చేసే ఛాన్స్ ఢిల్లీకి లభించింది. బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసిన క్రిస్ మోరీస్.. బాల్ నేరుగా ఫీల్డర్ మార్కస్ స్టాయినిస్ చేతుల్లోకి వెళ్లడంతో సింగిల్‌ తర్వాత నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉండిపోయాడు. కానీ.. కీపర్ ఎండ్‌వైపు వెళ్లిన జయదేవ్ ఉనద్కత్ రెండో పరుగు కోసం పరుగెత్తాడు. అయితే.. మోరీస్ నిరాకరించడంతో వెంటనే వెనుదిరిగే ప్రయత్నంలో ఉనత్కద్ పిచ్ మధ్యలో జారి పడిపోయాడు.

అదే సమయంలో బంతిని అందుకున్న స్టాయినిస్ నేరుగా కీపర్ రిషబ్ పంత్‌కి త్రో చేయడంతో ఉనద్కత్ రనౌటయ్యేలా కనిపించాడు. కానీ.. త్రోని అందుకున్న రిషబ్ పంత్ వికెట్లని గీరాటేసే సమయానికి అతని గ్లౌవ్స్ నుంచి బంతి బౌన్స్ అయ్యి వెలుపలి వచ్చేసింది. దాంతో.. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. చివర్లో ఉనద్కత్ సపోర్ట్‌తో 4 సిక్సర్లు బాదిన క్రిస్ మోరీస్.. మరో 2 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్‌ని గెలిపించాడు. ఒకవేళ ఉనద్కత్ రనౌటై ఉండింటే..? అప్పటికే ఏడు వికెట్లు చేజారడంతో క్రిస్ మోరీస్ కూడా ఒత్తిడిలో పడేవాడు.






Untitled Document
Advertisements