కేంద్రం నుంచి అదిరే స్కీమ్స్...కరోనా టైమ్‌లోనూ రూ.12 వేలు పొందొచ్చు

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 01:31 PM

కేంద్రం నుంచి అదిరే స్కీమ్స్...కరోనా టైమ్‌లోనూ రూ.12 వేలు పొందొచ్చు

కేంద్ర ప్రభుత్వం రెండు రకాల పెన్షన్ స్కీమ్స్ అందిస్తున్నాయి. వీటి వ్లల చాలా మంది బెనిఫిట్ పొందొచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించొచ్చు. పీఎఫ్ఆర్‌డీఏ నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS, అటల్ పెన్షన్ యోజన APY అనే రెండు పెన్షన్ స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది.

కరోనా సమయంలోనూ ఈ స్కీమ్స్ అదరగొట్టాయి. వీటిల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూనే వచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌‌లో చేరిన వారి సంఖ్య 2021 మార్చి 31 నాటికి 23 శాతం పెరిగింది. 4.24 కోట్లకు ఎగసింది. అదేసమయంలో అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారి సంఖ్య 33 శాతం పెరుగుదలతో 2.8 కోట్లకు చేరింది.


పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి అటల్ పెన్షన్ యోజన అకౌంట్‌ను తెరవొచ్చు. బ్యాంక్ అకౌంట్ ఉంటే సులభంగానే ఏపీవై పథకంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ కచ్చితంగా కావాలి. ఈ స్కీమ్‌లో చేరిన వారికి నెలకు రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ వస్తుంది.

60 ఏళ్ల తర్వాతనే పెన్షన్ లభిస్తుంది. మీరు ఎంత పెన్షన్ పొందాలనే అంశం ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన డబ్బులు కూడా ఆధారపడి ఉంటాయి. మీకు 40 ఏళ్లు ఉన్నాయని అనుకుంటే.. మీరు నెలకు రూ.1,000 పొందాలని యోచిస్తే.. మీరు నెలకు రూ.291 కట్టాలి. 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లించాలి. అదే రూ.5 వేలు పొందాలని భావిస్తే.. నెలకు రూ.1454 కట్టాలి.





Untitled Document
Advertisements