పరీక్షల సమయంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఇలా చేయండి

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 02:36 PM

 పరీక్షల సమయంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఇలా చేయండి

నేటి యువత చదువు, పరీక్షల సమయంలో అలసిపోయి అనారోగ్యం బారినపడుతుంది. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఒత్తిడికి గురవుతుంటారు. పరీక్షల జ్వరం ఆవహిస్తుంది. చదువులో పడి విద్యార్ధులు సరైన ఆహారాన్ని తీసుకోరు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడమే అంటున్నారు పోషకాహార నిపుణులు. సిన ఆహారం, వ్యాయామం చేస్తే పరీక్షలను ఎదుర్కోవడం చాలా సులువు. ఏఏ ఆహారం, ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా సూచనలు ఇచ్చారు పోషకాహార నిపుణులు.
పొద్దున్నే పరిషకు వెళ్ళే వారు బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా తినాలి. సమయం లేదంటూ, టిఫిన్ తీసుకోకుండా వెళుతుంటారు. అలా చేయడం మంచిది కాదు. ఆలస్యయమైనా సరే ఇడ్లీ, దోసె, ఉప్మా ఏదైనా తీసుకోవచ్చు. మధ్య మధ్య స్నాక్స్ గా ఖర్జూరం, బాదం, వాల్న్ట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇంకా శాండ్విచ్ విత్ వెజిటేబుల్ కట్సుతో ఇవ్వడం, క్యారెట్ ను కూడా చేర్చితే మరి మంచిది. పెరుగు, మజ్జిగ చాలా మంది ఇష్టపడరు. అందువల్ల పెరుగుతో ఫ్రూట్ సలాడ్స్ చేసి ఇవ్వడం మంచిది.వీలైతే ఆ సీజనులో లభించే పళ్లన్నీ ముక్కలుగా తరిగి కాస్త తేనే, మిరియాల పొడి, చిటికెడు ఉప్పు చల్లి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు.
కాఫీ, టీ లకు బదులుగా గ్రీన్ టీ ఇవ్వండి. ఆరోగ్యానికి మంచిది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్నాక్స్ రూపంలో రోస్ట్ చేసిన మరమరాలతో బెల్ పూరీ ఇంట్లో తయారు చేస్తే పిలల్లు, పెద్దలు ఇష్టంగా తింటారు. అలాగే సాయంత్రం సమయంలో క్యారెట్ లేదా బీట్రూట్ జ్యూస్ , టమాట జ్యూస్, మిల్క్ షెక్స్ లాంటివి ఇంట్లోనే తయారు చేసుకొంటే ఇంటిల్లిపాది త్రాగొచ్చు. అందరి ఆరోగ్యానికి మంచిదే. పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగాలి.
పరీక్షల వేళల్లో టిఫిన్ తప్పనిసరిగా తినడం, కమ్మటి నిద్ర కోసం వేడి పాలు తాగడం, ఇంట్లో వండిన పదార్దాలను మాత్రమే తినడం ఆరోగ్యకరం. ఒకేసారి ఎక్కువగా తినడం కంటే కొద్దికొద్దిగా,ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం మంచిది. పరీక్షల సమయంలో విద్యార్థులు తక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల మానసికంగా శారీరకంగా కూడా నీరస పడతారు. సమయం మళ్ళిదొరకదని ఒకేసారి తినడానికి ప్రయత్నిస్తారు. ఒకేసారి ఎక్కువగా భోజనం తీసుకోవడం వల్ల నిద్ర మత్తు ఉంటుంది.
ఆహారాన్ని కొద్దికొద్దిగా ఐదారు సార్లు తీసుకోవాలి. అప్పుడే సమతుల్యంగా ఉంటుంది. విద్యార్థులు చదువుకునేందుకు శక్తి వస్తుంది. పరీక్షలు రాసేవారు ఐదారు గంటలైనా నిద్రపోవాలి. అందుకే పడుకునే ముందు తప్పని సరిగా గ్లాసు గోరువెచ్చటి పాలు తాగాలి.
పరీక్షలు రాసే వారిని ఇతర వ్యాధులు చుట్టుముట్టకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి ఉండాలి. ఈ శక్తి రావాలంటే విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే పదార్దాలు తీసుకోవాలి. విటమిన్ సి వుండే ఆరెంజ్, బత్తాయి, జామకాయ, క్యారెట్, క్యాప్సికం, టమాటా తినాలి. ఆకుకూరలు, నట్స్ ఒక ప్రణాళిక రూపొందించుకుని ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. పరీక్షలు బాగా రాయగలుగుతారు.





Untitled Document
Advertisements