ప్రముఖ హాస్య నటుడుకి గుండెపోటు!

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 02:39 PM

ప్రముఖ హాస్య నటుడుకి గుండెపోటు!

ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్‌(59)కు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ‘బాయ్స్’, ‘శివాజీ’, ‘రఘువరన్ బీటెక్’, ‘సింగం’ వంటి సినిమాల్లో ఆయన తన కామెడీ టైమింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కార్డియాక్ అరెస్ట్‌తో వివేక్ బాధపడుతున్నారని.. వైద్యులు నిర్ధారించారు.
గురువారం చెన్నైలోని ఓమందూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్ కోవిడ్ టీకా తీసుకన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారానే ఈ భయంకర వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలమని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడటం, సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. కొందరు ఆయుర్వేద ముందులు, విటమిన్ సీ, జింక్ మందులు వాడటంలో తప్పేమి లేదన్న ఆయన.. వాటన్నికంటే ఉత్తమమైనది వ్యాక్సిన్ మాత్రమే అని అన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకి వైరస్ సోకదు అని తాను చెప్పడం లేదని.. కానీ, కరోనా సోకినా.. మరణం రాదని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ఆయనకి గుండెపోటు రావడంతో ఆయన అభిమానులు భయాందోళనకు గురవుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కారణంగానే ఈ దురదృష్టకర ఘటన జరిగిందా అని భయపడుతున్నారు. అయితే వివేక్ ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్న వైద్యులు.. ఆయనకి గుండెపోటు రావడానికి వ్యాక్సిన్‌కి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం వివేక్ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని.. ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆస్పత్రి వెల్లడించింది.





Untitled Document
Advertisements